NTV Telugu Site icon

Duddilla Sridhar Babbu : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అత్యంత ప్రమాదకరంగా ఉంది

Sridhar Babu

Sridhar Babu

అసెంబ్లీలో శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అత్యంత ప్రమాదకరంగా ఉందని, రాజ్యాంగానికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. అనుసరించాల్సిన సమైక్య న్యాయ సూత్రాలకు పూర్తిగా విరుద్ధంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఏపీ పునర్విభజన చట్టం 2014 అనుగుణంగా నిధుల కేటాయింపు జరగలేదని ఆయన మండిపడ్డారు. షెడ్యూల్ తొమ్మిది, పది అంశాలని పట్టించుకోలేదని, అన్ని రాష్ట్రాలకు సమన్యాయం కులమత బేదాలకు తావులేకుండా బడ్జెట్ ఉంటుందని చెప్పారన్నారు మంత్రి శ్రీధర్‌ బాబు. ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్లో ఒక్కసారి కూడా తెలంగాణ పదాన్ని పలకలేదని, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో 35 హామీలున్నవని ఆయన పేర్కొన్నారు. హామీల కోసం మేము చాలాసార్లు ప్రస్తావించామన్నారు. కానీ బీఆర్ఎస్ నాయకులు ఏనాడు పోరాటం చేయలేదని, కానీ తెలంగాణను బడ్జెట్లో నిర్లక్ష్యం చేశారన్నారు. పునర్విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణకు కూడా ప్రాధాన్యత ఇస్తామని ఉందని, తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఎకనామిక్ గ్రోత్ ఉన్న రాష్ట్రమని ఆయన వెల్లడించారు.

Duddilla Sridhar Babbu : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అత్యంత ప్రమాదకరంగా ఉంది

అంతేకాకుండా.’ఇండస్ట్రియల్ కారిడార్ లో హైదరాబాద్ పేరు ఉంది. వాళ్ల నోడ్ లో ఇప్పుడు ఏపీలో ఉంది. ఏపీకి పునర్విభజన చట్టంలో భాగంగా నిధులు ఇస్తే మాకు అభ్యంతరం లేదు. కానీ తమ ప్రభుత్వంలో భాగస్వాములు గా ఉన్నారు అందుకే వాళ్లకు నిధులు ఇస్తామనేది కరెక్ట్ కాదు. ఎందుకు కేంద్ర ప్రభుత్వం తెలంగాణను చిన్న చూపు చూస్తుంది. ఉరుముదయ పథకంలో ఏపీకి,బీహార్ కి న్యాయం చేస్తామనడం కరెక్ట్ కాదు. నీటి ప్రాజెక్టులో తెలంగాణకు నిధులు ఇవ్వాలని కోరితే ఆ ప్రస్తావని చేయలేదు. బీజేపీ ఎంపీలు ఎందుకు మాట్లాడటం లేదు. ప్రపంచ స్థాయిలో పేరొందిన టూరిజం ప్రాంతాలు తెలంగాణలో ఉన్నవి. వాటి ప్రస్తావనే లేదు. ఎన్డీయే గవర్నమెంట్ లో నీతి ఆయోగ్ ప్రవేశపెట్టి ప్లానింగ్ కమిషన్ ఏర్పాటు చేసింది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సంబంధించి విధులు, నిధులు హక్కులని తుంగలో తొక్కుతుంది. 14వ ఆర్థిక సంఘానికి సంబంధించిన నిధులని అనేకసార్లుగా రాష్ట్ర ప్రభుత్వం అడుగుతుంది. కానీ దాన్ని కూడా పక్కన పెట్టడం జరిగింది. ఆర్టికల్ 275 ని కూడా పట్టించుకోలేదు. ఇతర రాష్ట్రాలతో పాటు తెలంగాణని ముందుకు తీసుకపోకపోతే వికసిత్ భారత్ కి సాధ్యం కాదు. తెలంగాణ రాష్ట్రంలో అనేక వెనుకబడిన జిల్లాలు ఉన్నాయి.’ అని శ్రీధర్‌ బాబు అన్నారు.

Table-Top Runways: నేపాల్ విమాన ప్రమాదానికి ‘‘టేబుల్‌-టాప్ రన్ వే’’ కారణం.. భారత్‌లో 5 ఎయిర్‌పోర్టులు.. గతంలో ప్రమాదాలు..

Show comments