NTV Telugu Site icon

Sudigali Sudheer Rashmi: సుడిగాలి సుధీర్ రీఎంట్రీతో ఏడ్చేసిన రష్మీ

Rashmi

Rashmi

Sudigali Sudheer Rashmi: జబర్దస్త్ ప్రోగ్రాంలో తనదైన మార్క్ కామెడీతో సుడిగాలి సుధీర్ స్టార్ స్టేటస్ సంపాదించుకున్నారు. యాక్టింగ్ కంటే రష్మీతో లవ్ ట్రాక్ తో ఎక్కువ పాపులర్ అయ్యారు. జబర్దస్త్ ద్వారా ఎంతో మంది కమెడియన్స్ పాపులారిటీ సంపాదించుకొని ప్రస్తుతం సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంటున్నారు. ఆ కోవలోనే సుధీర్ కూడా వెండితెరపై కూడా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొన్నాళ్లుగా తన గాలోడు సినిమా బిజీతో తన మాతృసంస్థకు దూరంగా ఉన్నారు. తాజాగా మళ్లీ తాను ఈటీవీలోకి రీ ఎంట్రీ ఇచ్చినట్లు శ్రీదేవీ డ్రామా కంపెనీ ప్రోగ్రాం ప్రోమోలో కనిపిస్తున్నారు.

Read Also: Raghu Veera Reddy Dance : మనుమరాలితో కలిసి డ్యాన్స్ ఇరగదీసిన రఘువీరా రెడ్డి

ఒక సాదాసీదా కమెడియన్గా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు సుధీర్. తన డాన్స్ పెర్ఫార్మెన్స్ లతో మ్యాజిక్ షో లతో ప్రేక్షకులను మరింత కట్టిపడేశాడు. ఒకరకంగా బుల్లితెరపై స్టార్ హీరో రేంజ్ లో వెలుగొందాడు. అలాంటి సుడిగాలి సుధీర్ తనకు కొత్త జీవితాన్ని ప్రసాదించిన జబర్దస్త్ ను వదిలేసి పక్క ఛానల్ కు వెళ్లిపోయాడు. దీంతో అభిమానులందరూ షాక్ అయ్యారు. మళ్లీ ఈటీవీలోకి రీఎంట్రీ ఇస్తాడు అని అందరూ భావించినట్లే సుడిగాలి సుధీర్ వచ్చేశాడు. ఇటీవల శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో విడుదలై వైరల్ గా మారిపోయింది. ఈ ప్రోమో చూసుకుంటే సుడిగాలి సుదీర్ రష్మితో కలిసి మళ్ళీ యాంకరింగ్ చేస్తున్నాడు. ఇక జబర్దస్త్ స్టేజ్ పై మరోసారి సుధీర్ కనిపించి తనదైన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. ఇక రష్మీతో మళ్ళీ లవ్ ట్రాక్ తెరమీదకి తీసుకురావడానికి ప్రయత్నించాడు. సుధీర్ రాకతో రష్మీ ఓ క్షణం ఎమోషనల్ అయ్యారని తెలుస్తోంది.

Show comments