Tirumala: తిరుమలలో నేటితో పద్మావతి పరిణయోత్సవాలు ముగియనున్నాయి. ఇవాళ గరుడ వాహనంపై నారాయణగిరి ఉద్యానవనానికి శ్రీవారు చేరుకోనున్నారు. శనివారం సాయంత్రం నారాయణగిరి ఉద్యానవనంలో కన్నుల పండువగా పరిణయోత్సవం జరగనుంది. శ్రీ పద్మావతి పరిణయోత్సవం సందర్భంగా ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది.
Read Also: Palnadu: పల్నాడులో కొనసాగుతున్న అల్లర్ల కేసుల విచారణ
ఇదిలా ఉండగా.. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లు అన్ని నిండిపోయి అక్టోపస్ బిల్జింగ్ వరకు వెలుపల క్యూ లైన్‌లో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. నిన్న రికార్డు స్థాయిలో స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు. నిన్న శ్రీవారిని 90,721 మంది భక్తులు దర్శించుకోగా.. 50,599 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శనివారం హుండీ ఆదాయం రూ.3.28 కోట్లు వచ్చింది.