Sri Chaitanya School Ragging: శ్రీచైతన్య స్కూల్లో ర్యాగింగ్.. ఐరన్ బాక్స్‌తో పొట్ట, చేతులపై విచక్షణారహితంగా వాతలు!
- కార్పోరేట్ స్కూలులోనే ర్యాగింగ్
- రాజమండ్రిలోని శ్రీచైతన్య స్కూలులో ర్యాగింగ్
- ఇద్దరు స్టూడెంట్స్ స్కూల్ హాస్టల్లో వెకిలి పనులు
- ప్రిన్సిపాల్ సారుకు పేర్లు చెప్పాడని చితకబాదారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాలేజీల్లో ర్యాగింగ్ భూతం ఎంత దారుణంగా ఉంటుందో మనం చూశాం. ఐతే ప్రభుత్వాలు ర్యాగింగ్ మీద దృష్టి పెట్టడంతో దాదాపు ఇప్పుడు కంట్రోల్‌లోనే ఉంది. కానీ విచిత్రంగా ఓ కార్పోరేట్ స్కూలులోనే ర్యాగింగ్ మళ్లీ చిగురించడం కలకలం రేపుతోంది. నిజానికి స్కూల్లో ర్యాగింగ్ చాలా తక్కువ. కానీ రాజమండ్రిలోని శ్రీచైతన్య స్కూలులో ఓ విద్యార్థిని తోటి విద్యార్థులు ర్యాగింగ్ పేరుతో దారుణంగా హింసించారు. ఈ ఘటనతో విద్యార్థులు ఒక్కసారిగా ఉలిక్క పడ్డారు.
ఇక్కడ చూడండి.. బెడ్‌పై దీనంగా పడుకుని ఉన్న ఈ బాలుడి పేరు గుర్రం విన్సెంట్ ప్రసాద్. కోనసీమ జిల్లా మలికిపురం మండలం శంకరగుప్తం స్వస్థలం. ఈ బాలుడ్ని మంచిగా చదివించేందుకు తల్లిదండ్రులు లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఇందుకోసం రాజమండ్రిలోని శ్రీచైతన్య స్కూలులోని హాస్టల్లో ఉంచి చదివిస్తున్నారు. కానీ ఇప్పుడు ఈ పిల్లాడు మాత్రం.. హస్టల్లో జరిగిన ర్యాగింగ్ భూతం కారణంగా ఇలా రాజోలులోని ఆస్పత్రి బెడ్‌పై చికిత్స చేయించుకోవాల్సి వచ్చింది.
Also Read
- Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
- VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్‌ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
- Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
- CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
విన్సెంట్ ప్రసాద్.. ఇప్పుడు పదో తరగతి చదువుతున్నాడు. అందరు విద్యార్థులతో బాగానే ఉంటాడు. కానీ అందులో ఇద్దరు స్టూడెంట్స్ స్కూల్ హాస్టల్లో వెకిలి పనులు చేస్తున్నారు. హాస్టల్లో ఉన్న సీసీ కెమెరాను తీసేశారు. దీనిపై ప్రిన్సిపాల్ అందరినీ నిలదీశారు. ఆ సమయంలో విన్సెంట్ ప్రసాద్.. సీసీ కెమెరా తొలగించిన విద్యార్థుల పేర్లు చెప్పాడు. దీంతో కక్ష కట్టిన ఆ ఇద్దరు స్టూడెంట్స్… పైశాచికంగా ప్రవర్తించారు. తమ మీదే ప్రిన్సిపల్‌కు చెబుతావా అంటూ ఐరన్ బాక్స్‌తో పొట్ట, చేతులపై విచక్షణారహితంగా వాతలు పెట్టారు. దీంతో విన్సెంట్ ప్రసాద్‌కు తీవ్ర గాయాలయ్యాయి.
ఆ కాలిన గాయాలను విన్సెంట్ ప్రసాద్ ఓర్చుకున్నాడు. తనను మళ్లీ ఏదైనా చేస్తారేమోనన్న భయంతో ఎవరికీ చెప్పలేదు. చివరకు మెల్లగా తల్లిదండ్రులకు విషయం తెలిసింది. దీంతో అతన్ని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. ప్రస్తుతం విన్సెంట్ ప్రసాద్ కోలుకుంటున్నాడని పేరెంట్స్ చెప్పారు. ఐతే లక్షల రూపాయలు ఖర్చు చేసి చదివిస్తుంటే.. శ్రీచైతన్య యాజమాన్యం ఏ మాత్రం పిల్లల బాగోగులు పట్టించుకోవడం లేదని పేరెంట్స్ ఆరోపిస్తున్నారు.
తాజావార్తలు
-
Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
-
DK Aruna : ఓటమి భయంతోనే కాంగ్రెస్ డ్రామాలు.. ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు..
-
VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్‌ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
-
Don’t Trouble The Trouble: రాజమౌళికి బిగ్ షాక్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!