Site icon NTV Telugu

Sri Chaitanya: విద్యార్థులకు నాసిరకం భోజనం.. తీరు మార్చుకోని సెంట్రల్ కిచెన్ సిబ్బంది

Sri Chaithanya

Sri Chaithanya

శ్రీచైతన్య విద్యాసంస్థల సెంట్రల్ కిచెన్ వద్ద ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లతో శ్రీ చైతన్య సిబ్బంది వాగ్వాదానికి దిగింది. గ్రేటర్ హైదరాబాద్‌కి సంబంధించిన శ్రీ చైతన్య సెంట్రల్ కిచెన్ లైసెన్స్‌ను ఫుడ్ సేఫ్టీ అధికారులు గత శుక్రవారం సస్పెండ్ చేశారు. ఇప్పటికే ఆరు నెలల్లో మూడు సార్లు తనిఖీలు చేస్తే.. మూడు సార్లు నాసిరకం కూరగాయలతో కిచెన్ మెయింటినెన్స్ చేస్తున్నారు.. గత జూన్ నెలలో కిచెన్‌లోని కూరగాయలను ల్యాబ్ కి పంపితే ల్యాబ్ అధికారులు నాసిరకమని తేల్చారు.

Read Also: Jasprit Bumrah: ఐసీసీ టెస్టు క్రికెటర్ ఆఫ్‌ ది ఇయర్‌గా బుమ్రా.. తొలి భారత పేసర్ గా రికార్డ్!

శ్రీ చైతన్య విద్యాసంస్థలలో చదివే వేలాది మంది విద్యార్థులకు ఈ సెంట్రల్ కిచెన్ నుంచే ఫుడ్ సరఫరా చేస్తుంది శ్రీ చైతన్య సిబ్బంది.. కిచెన్‌లో పాడైపోయిన ఆహార పదార్థాలను నిల్వ ఉంచగా.. దాదాపుగా 125 కిలోల ఎక్స్పైరీ ఫుడ్ ప్రొడక్ట్స్‌ని ఫుడ్ సేఫ్టీ అధికారులు సేకరించారు. బియ్యం, కూరగాయలు, పప్పుదినుసులను అపరిశుభ్ర వాతావరణంలో స్టోర్ చేస్తున్నట్టు గుర్తించారు. కిచెన్‌, స్టోర్ రూమ్‌లో బొద్దింకలు, ఎలుకలు తిరుగుతున్నట్టు తేల్చారు. కాగా.. విద్యార్థులకు ఆహారాన్ని అందించడం ఇబ్బంది అవుతుందని.. కిచెన్ ఓపెన్ చేసి పెడతామంటూ ఫుడ్ సేఫ్టీ అధికారులతో శ్రీ చైతన్య సిబ్బంది, నిర్వాహకులు వాగ్వాదానికి దిగారు.

Read Also: Udhayanidhi Stalin: ‘‘సనాతన ధర్మం’’పై వ్యాఖ్యలు.. సుప్రీంకోర్టులో ఉదయనిధికి ఉపశమనం..

Exit mobile version