NTV Telugu Site icon

SRH vs RR: హాఫ్ సెంచరీలతో ఆదుకున్న నితీష్ రెడ్డి, హెడ్.. రాజస్థాన్ టార్గెట్ 202..

Srh Vs Rr

Srh Vs Rr

నేడు ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ తో పోటీపడుతుంది. మ్యాచ్లో మొదట టాస్ గెలిచి సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేయగలిగింది.

Also read: Kubera: ‘కుబేర’ నుండి నాగార్జున ఫస్ట్ లుక్ వచ్చేసిందోచ్..

ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఓపెనర్ ట్రావిస్ హెడ్, తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి హాఫ్ సెంచరీలతో సన్ రైజర్స్ 201 పరుగులను చేయగలిగింది. మొదట రెండు వికెట్లను త్వరగా కోల్పోయిన హైదరాబాద్ జట్టు కాస్త నిదానంగానే స్కోర్ బోర్డును ముందుకు సాగించింది. రానురాను హెడ్ గేర్ మార్చడంతో స్కోర్ పరిగెత్తింది. ఇన్నింగ్స్ లో భాగంగా హెడ్ 44 బంతుల్లో 58 పరుగులు చేసి అవుట్ అవ్వగా, అభిషేక్ శర్మ 12, సింగ్ ఐదు పరుగులు చేసి అవుట్ అయ్యారు. నితీష్ కుమార్ రెడ్డి 42 బంతుల్లో మూడు ఫోర్స్, ఎనిమిది సిక్సర్ల సహాయంతో 76 పరుగులను రాబట్టి అజేయంగా నిలిచాడు. ఇక చివర్లో కెప్టెన్ క్లాసన్ 19 బంతుల్లో 42 పరుగులను జోడించడంతో స్కోరుబోర్డు 200 దాటింది.

Also read: T20 World Cup 2024: రింకూ సింగ్‌ ఎంపిక చేయకపోవడంపై అసలు నిజం చెప్పేసిన చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్..

ఇక రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ విషయానికి వస్తే.. ఆవేష్ ఖాన్ రెండు వికెట్లు, సందీప్ శర్మ ఒక వికెట్ తీసుకున్నారు. దాంతో రాజస్థాన్ రాయల్స్ టార్గెట్ 202గా ఉంది.