NTV Telugu Site icon

SRH vs PBKS: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్..!

12

12

ఐపీఎల్ 2024 సీజన్ లో భాగంగా చంఢీఘర్ వేదికగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తో జరుగుతున్న నేటి మ్యాచ్‌ లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇక ఈ మ్యాచ్ కు ముందు సన్ రైజర్స్ జట్టు నాలుగు మ్యాచ్లు ఆడగా అందులో రెండు విజయాలను అందుకోగా.. రెండు మ్యాచ్ లలో ఓడిపోయింది. దీంతో ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు పాయింట్లు పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతుండగా.. మరోవైపు పంజాబ్ కింగ్స్ కూడా నాలుగు మ్యాచ్ లలో రెండు మ్యాచ్లు గెలుపొందగా రెండు మ్యాచ్లను కోల్పోయింది. దీంతో నెట్ రేట్ ప్రకారంగా చూసుకుంటే పంజాబ్ కింగ్స్ జట్టు హైదరాబాద్ తర్వాత స్థానంలో కొనసాగుతుంది.

Also Read: Dhoni Jadeja: గురువుకు తగ్గ శిష్యుడు.. ఆ విషయంలో ధోనిని సమం చేసిన జడ్డు భాయ్..!

ఇక నేటి టీమ్స్ వివరాలు చూస్తే.. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఐడెన్ మార్క్‌రమ్, హెన్రిచ్ క్లాసెన్(w), అబ్దుల్ సమద్, నితీష్ రెడ్డి, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్(సి), భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, టి నటరాజన్ ఉండగా.. పంజాబ్ కింగ్స్ జట్టు లో శిఖర్ ధావన్ (సి), జానీ బెయిర్‌స్టో, జితేష్ శర్మ (w), అశుతోష్ శర్మ, సామ్ కర్రాన్, శశాంక్ సింగ్, సికందర్ రజా, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబాడ, అర్ష్‌దీప్ సింగ్ లు ప్లేయింగ్ 11 లో ఉన్నారు.

Show comments