SRH Hero Nitish Kumar Reddy about Pawan Kalyan’s Narajugakura Song: ప్రస్తుతం సోషల్ మీడియాలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆల్‌రౌండర్, తెలుగు ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి పేరే మార్మోగిపోతోంది. ఐపీఎల్ 2024లో భాగంగా మంగళవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నితీష్ చెలరేగడమే ఇందుకు కారణం. 10 ఓవర్లకు సన్‌రైజర్స్ స్కోరు 64 పరుగులే అయినా.. 20 ఓవర్లు ముగిసేసరికి 182 స్కోర్ చేసిందంటే కారణం నితీశ్. ప్రతికూల పరిస్థితుల్లో చెలరేగి ఆడిన ఈ ఆంధ్ర బ్యాటర్.. 37 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 64 పరుగులు చేశాడు. అసాధారణ బ్యాటింగ్‌తో సన్‌రైజర్స్ జట్టును ఆదుకున్న 20 ఏళ్ల నితీష్ రెడ్డిపై క్రికెట్ అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
నితీశ్ రెడ్డి ఇలా రెచ్చిపోవడానికి కారణం పవర్ స్టార్ ‘పవన్ కళ్యాణ్’ అట. మ్యాచ్‌కు ముందు ‘జానీ’ సినిమాలోని ‘నారాజుగాకురా మా అన్నయ్యా.. నజీరు అన్నయా.. ముద్దుల కన్నయ్య.. అరె మనరోజు మనకుంది మన్నయ్యా’ అనే పాటను వింటానని నితీశ్ తెలిపాడు. ఈ పాట బీట్, ఎనర్జీ తనకు బూస్ట్ ఇస్తుందని చెప్పాడు. అంతేకాదు నితీశ్ నారాజుగాకురా మా అన్నయ్యా పాట కూడా పాడాడు. ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోకి లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది.
Also Read: Nitish Reddy IPL 2024: పంజాబ్‌పై విధ్వంసం సృష్టించిన తెలుగు ఆటగాడు.. ఎవరీ నితీష్ రెడ్డి?
మంగళవారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 2 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. నితీశ్ రెడ్డి (64; 37 బంతుల్లో 4×4, 5×6) హాఫ్ సెంచరీ చేశాడు. పంజాబ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ (4/29) రాణించాడు. ఛేదనలో పంజాబ్ 6 వికెట్లకు 180 పరుగులు చేసింది. శశాంక్ సింగ్ (46 నాటౌట్; 25 బంతుల్లో 6×4, 1×6), అశుతోష్ శర్మ (33 నాటౌట్; 15 బంతుల్లో 3×4, 2×6) పోరాడారు. భువనేశ్వర్ కుమార్ (2/32), ప్యాట్ కమిన్స్ (1/22) రాణించారు.
Nitish video tho tagulko chinna @SunRisers https://t.co/05cMWx8PkU pic.twitter.com/1vH0TWx6WW
— Supreme PawanKalyan FC™ (@SupremePSPK) April 9, 2024