Site icon NTV Telugu

SRH vs MI: నగరానికి చేరుకున్న ముంబై, హైదరాబాద్ టీమ్స్.. ఉప్పల్ స్టేడియంలో ప్రాక్టీస్!

Uppal Stadium

Uppal Stadium

SRH and MI Teams practice in Uppal Stadium: ఐపీఎల్ 2024లో భాగంగా బుధవారం (మార్చి 27) సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ బుధవారం రాత్రి 7.30 గంటలకు హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆరంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం ముంబై, హైదరాబాద్ టీమ్స్ సోమవారం రాత్రి భాగ్యనగరానికి చేరుకున్నాయి. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ఇరు జట్ల ప్లేయర్స్ హోటల్‌కు చేరుకున్నారు.

మంగళవారం మధ్యాహ్నం నుంచి ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్లు ప్రాక్టీస్ చేయనున్నాయి. సాయంత్రం వరకు ప్లేయర్స్ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ సాధన చేస్తారు. ఇక సాయంత్రం 5 గంటలకు ముంబై టీమ్ ప్రెస్ మీట్ నిర్వహించనుంది. సాయంత్రం 5.30 గంటలకు హైదరాబాద్ టీమ్ ప్రెస్ మీట్ ఉంది. రేపటి మ్యాచ్‌కు సంబంధించి పలు విషయాలపై ఇరు జట్ల కెప్టెన్స్, కోచ్‌లు మాట్లాడనున్నారు.

Also Read: Game Changer: పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేయడం లేదా?

సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మ్యాచ్ టిక్కెట్‌ల కోసం ఫాన్స్ ఎగబడుతున్నారు. ఈ టిక్కెట్‌లు పేటీఎం ఇన్‌సైడర్ యాప్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే టిక్కెట్స్ అన్ని అమ్ముడుపోవడంతో.. దొరకని వారు నిరాశ చెందుతున్నారు. తమ తొలి మ్యాచ్‌లో ఓడిన సన్‌రైజర్స్, ముంబై బోణి కొట్టాలని చూస్తున్నాయి.

Exit mobile version