NTV Telugu Site icon

SRH VS MI: ముంబై, హైదరాబాద్ మధ్య కీలకపోరు… టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై

Mi Vs Srh Live

Mi Vs Srh Live

మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. ఈ రోజు ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య ఆసక్తికరపోరు జరుగనుంది. హైదరాబాద్ తన సెమిస్ ఆశలను పదిలంగా ఉంచుకోవాలంటే తప్పనిసరిగా ముంబైపై విజయం సాధించాలి. ఇదిలా ఉంటే ఇప్పటికే ముంబై  ఇండియన్స్ ఈ సీజన్ లో ఘోరంగా విఫలం అవుతోంది. ఈ రెండు జట్ల మధ్య వాంఖడే స్టేడియం, ముంబై వేదికగా మ్యాచ్ జరుగబోతోంది. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ ఫీల్డింగ్ ఎంచుకున్నారు. దీంతో సన్ రైజర్స్ మొదట బ్యాటింగ్ చేయనుంది.

ఇదిలా ఉంటే వరసగా నాలుగు విజయాలు సాధించి గాడిలో పడిందనుకున్నా సన్ రైజర్స్ ఇటీవల వరస మ్యాచుల్లో పరాజయం పాలైంది. దీంతో సెమిస్ ఆశలు సంక్లిష్టం చేసుకుంది. ఈ రోజు మ్యాచ్ లో తప్పని సరిగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. జట్టులో మ్యాచ్ విన్నర్లుగా ఎవరూ కనిపించడం లేదు. కెప్టెన్ విలియంసన్ అనుకున్నంతగా ఆకట్టుకోలేకపోతున్నాడు. ఇదిలా ఉంటే ముంబై పరిస్థితి మరింత దారుణంగా ఉంది. అత్యంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ముంబై ఇండియన్స్ ఘోరంగా విఫలం అవుతున్నారు. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, అనుకున్నంతగా రాణించడం లేదు. ప్రస్తుతం సన్ రైజర్స్ 12 మ్యాచుల్లో 5 మ్యాచుల్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉండగా… ముంబై ఇండియన్స్ 12 మ్యాచుల్లో మూడింటిలో గెలిచి అట్టడుగు స్థానంలో ఉంది.

తుది జట్ల వివరాలు:

సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, ప్రియమ్ గార్గ్, కేన్ విలియమ్సన్(సి), రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మర్క్రామ్, నికోలస్ పూరన్(w), వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, ఫజల్హాక్ ఫరూకీ, ఉమ్రాన్ మాలిక్, టి నటరాజన్

ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): ఇషాన్ కిషన్(w), రోహిత్ శర్మ(c), డేనియల్ సామ్స్, తిలక్ వర్మ, రమణదీప్ సింగ్, ట్రిస్టన్ స్టబ్స్, టిమ్ డేవిడ్, సంజయ్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, రిలే మెరెడిత్, మయాంక్ మార్కండే

Show comments