NTV Telugu Site icon

SRH Retentions List: తగ్గేదేలే.. దమ్మున్న ఆటగాళ్లను రిటైన్ చేసుకున్న ఎస్ఆర్‭హెచ్

Srh

Srh

SRH Retentions List for 2025 IPl: ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు.. ఈ ఏడాది రన్నరప్ గా నిలిచిన ఎస్ఆర్‭హెచ్ టీం తాజాగా జట్టు స్టార్ ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. ఇందుకు సంబంధించి తాజాగా సోషల్ మీడియా వేదికగా వివరాలను ఎస్ఆర్ఎస్ టీం యాజమాన్యం వెల్లడించింది. అక్టోబర్ 31 కి ఆయా జట్లు తమ ఆటగాళ్ల రిటెన్షన్ లిస్టును విడుదల చేయాలని ఇదివరకే బీసీసీఐ తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు ప్రతి టీం వారి రిటెన్షన్ ప్లేయర్ల వివరాలను తెలుపుతున్నాయి.

ఇందులో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు యాజమాన్యం కూడా వారి జట్టుకు సంబంధించిన రిటెన్షన్ ప్లేయర్ల జాబితాను విడుదల చేసింది. ఇక ఈ జాబితా సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.. పాట్ కమిన్స్ రూ. 18 కోట్లకు, అభిషేక్ శర్మను రూ. 14 కోట్లకు, తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డిని రూ. 6 కోట్లకు, హెన్రిచ్ క్లాసన్ ను ఏకంగా రూ. 23 కోట్లకు, ట్రావిస్ హెడ్ ను రూ. 14 కోట్లకు ఎస్ఆర్ఎచ్ టీం అంటిపెట్టుకుంది. దీంతో యాజమాన్యానికి మిగతా ఆటగాలనుకునేందుకు 45 కోట్లు రూపాయలు మాత్రమే మిగిలి ఉన్నాయి.

ఎస్ఆర్‭హెచ్ టీం రిటైన్ చేసుకున్న ఆటగాళ్లను చూస్తే వచ్చే ఏడాది కూడా.. భారీ సిక్సర్ల మోత మోగబోతోందని ఇట్టే అర్థమవుతుంది. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ సీజన్ లో భాగంగా ఎస్ఆర్‭హెచ్ టీం బ్యాట్స్మెన్స్ ఏ విధంగా సిక్సుల సునామీ సృష్టించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Show comments