MS Dhoni-Nitish Reddy: ధోనీని అవమానించలేదు.. నాపై దుష్ప్రచారం చేస్తున్నారు: నితీశ్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SRH Player Nitish Kumar Reddy Says Please Watch Full Video on MS Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీపై తనకు ఎంతో గౌరవం ఉందని, కొందరు కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి తెలిపాడు. తాను ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియోని ఎడిట్ చేసి.. ధోనీపై నెగటివ్‌గా మాట్లాడినట్లు ప్రచారం చేస్తున్నారని చెప్పాడు. ధోనీ గురించి తాను మాట్లాడిన వీడియోను పూర్తిగా చూడాలని నితీశ్ రెడ్డి కోరాడు. ఐపీఎల్ 2024లో నితీశ్ 303 రన్స్ చేశాడు. టోర్నీ ఆరంభంలో మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడిన ఈ ఆంధ్రా ఆటగాడు.. ఆపై తక్కువ స్కోర్స్ చేస్తూ నిరాశపరిచాడు.
టాలీవుడ్ యువ హీరో కార్తికేయ తాజాగా నటించిన చిత్రం ‘భజే వాయు వేగం’. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా నితీశ్ కుమార్ రెడ్డిని కార్తీకేయ సరదాగా ఇంటర్వ్యూ చేశాడు. క్రికెట్, ఇతర విషయాల గురించి నితీశ్‌ని కార్తికేయ ప్రశ్నలు అడిగాడు. ఈ క్రమంలో ‘కొందరి ఆటగాళ్లకు నైపుణ్యం సహజ సిద్ధంగా ఉంటుంది, మరికొందరు కష్టపడి నైపుణ్యాన్ని సంపాదిస్తారు. వీరిలో ఎవరు ఎక్కువ విజయవంతం అవుతారు’ అని కార్తికేయ అడిగాడు. ‘ఆటలో ఒత్తిడిని జయించడమే ముఖ్యం. ఎంత టాలెంట్ ఉన్నా.. ఒత్తిడిని అధిగమించకపోతే ఫలితం ఉండదు. విరాట్ కోహ్లీతో పోలిస్తే ఎంఎస్ ధోనీకి టెక్నిక్ అంతగా ఉండదు. కానీ మహీ మైండ్ సెట్ గొప్పగా ఉంటుంది. మ్యాచ్‌ను బాగా అర్థం చేసుకుంటాడు. అందుకే దిగ్గజ ప్లేయర్‌గా ఎదిగాడు’ అని నితీశ్ పేర్కొన్నాడు.
Also Read
- AFG vs IND: మనవ్ సుతార్ అరంగేట్రం.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గిల్ సేన.!
- Vinukonda: అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన మాజీ సీఐ చినమల్లయ్య.!
- Abhijeet Dipke: అమెరికా నుంచి ఢిల్లీ చేరుకున్న కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు.. నేటి నుంచి నిరసనలు
- Vladimir Putin: "భారత్‌ను భయపెట్టాలని చూస్తే మీకే నష్టం".. ఆ దేశాలకు పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్!
Also Read: Team India Coach: కేకేఆర్‌కు గుడ్ బై.. టీమిండియా కోచ్‌గా గౌతమ్ గంభీర్!
ఎంఎస్ ధోనీకి టెక్నిక్ లేదు అని నితీశ్ రెడ్డి చెప్పిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన మహీ, టీమిండియా ఫాన్స్ నితీశ్‌పై మండిపడ్డారు. ఓ దిగ్గజ క్రికెటర్‌ను తక్కువ చేస్తావా?, టెక్నిక్ తెలియకుండానే భారత్‌కు అన్ని రన్స్ చేశాడా?, టీమిండియాకు రెండు ప్రపంచకప్‌లు ఎలా అందించాడు? అని నితీశ్‌ను ఓ ఆటాడుకున్నారు. ఈ విమర్శలపై తాజాగా నితీశ్ వివరణ ఇచ్చాడు. ధోనీ అంటే తనకి అపారమైన గౌరవం అని, వీడియో క్లిప్‌ను ఎడిట్ చేసి తనపై నెగటివ్ ప్రచారం చేస్తున్నారని చెప్పాడు. అందరూ పూర్తి వీడియోను చూడాలని కోరాడు.
తాజావార్తలు
-
AFG vs IND: మనవ్ సుతార్ అరంగేట్రం.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గిల్ సేన.!
-
Buchi Babu : జాన్వీ కపూర్ క్యారెక్టర్’పై బుచ్చిబాబు క్షమాపణలు..ఆ సీన్స్ కట్ చేస్తానని ప్రకటన!
-
E85 Fuel: భారత్ లో E85 ఇంధనం విడుదల.. పెట్రోల్ కంటే రూ.20 చౌక..! ప్రత్యేకతలు ఇవే
-
India Forex Reserves: రూపాయి స్థిరత్వానికి బలం.. పెరిగిన విదేశీ మారక నిల్వలు.. 938 మిలియన్ డాలర్ల వృద్ధి
-
Vinukonda: అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన మాజీ సీఐ చినమల్లయ్య.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!