NTV Telugu Site icon

Nithish Reddy: తెలుగు ఆటగాడు నితీష్ రెడ్డికి జాక్‌పాట్!

Nithish Reddy Srh

Nithish Reddy Srh

Nithish Reddy Becomes Costliest Player in APL 2024: సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్‌) యువ సంచలనం నితీష్ కుమార్ రెడ్డికి జాక్‌పాట్ తగిలింది. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) సీజన్ 3కి సంబంధించిన వేలంలో నితీష్ భారీ ధరకు అమ్ముడుపోయాడు. ఈ యువ ఆల్‌రౌండర్‌ను గోదావరి టైటాన్స్ రూ. 15.6 లక్షలకు దక్కించుకుంది. దాంతో ఏపీఎల్ లీగ్‌‌ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా నితీష్ నిలిచాడు. ఐపీఎల్‌ 2023 వేలంలో ఎస్‌ఆర్‌హెచ్‌ రూ. 20 లక్షల కనీస ధర కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.

ఐపీఎల్ 2023 లో నితీష్ రెడ్డికి ఎక్కువ అవకాశాలు రాలేదు. దాంతో మనోడి పేరు గతేడాది వెలుగులోకి రాలేదు. ఐపీఎల్ 2024లో వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకున్నాడు. సంచలన ఇన్నింగ్స్‌లతో స్టార్ అయ్యాడు. ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడిన నితీష్.. 239 పరుగులు, మూడు వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ 2024లో ఎస్‌ఆర్‌హెచ్‌ ప్లేఆఫ్స్‌కు అర్హత సాదించిన నేపథ్యంలో నితీష్ రెడ్డిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం సన్‌రైజర్స్ జట్టులో రెగ్యులర్ ఆటగాడిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.

Also Read: Sunrisers Hyderabad: నాలుగేళ్ల తర్వాత ప్లేఆఫ్స్‌కు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌.. ఇక కప్పు మనదే!

ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ జరుగుతోంది. ప్రతిభ కలిగిన స్థానిక ఆటగాళ్లను వెలుగులోకి తీసుకురావడమే ఈ టోర్నీ ముఖ్య ఉద్దేశం. ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి అయ్యాయి. ఈ టోర్నీలో 6 జట్లు పోటీపడుతాయి. బెజవాడ టైగర్స్, ఉత్తరాంధ్ర లయన్స్, గోదావరి టైటాన్స్, రాయలసీమ కింగ్స్, వైజాగ్ వారియర్స్, కోస్టల్ రైడర్స్ ఆడుతున్నాయి. సీజన్ 3 కోసం గురువారం వేలం జరిగింది. ఈ వేలంలో 408 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. జూన్ 30 నుంచి జూలై 13 వరకూ కడప, విశాఖ వేదికగా సీజన్ 3 మ్యాచ్లు జరగనున్నాయి.

Show comments