NTV Telugu Site icon

Kavya Maran: ఏంటి కావ్య పాప లవ్లో పడిందా.. ఆ యంగ్ క్రికెటర్ తోనేనా..?

Abhishek

Abhishek

SRH Owner Kavya Maran: ఐపీఎల్ మ్యాచులను చూసే వారికి కావ్య మారన్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ ప్రాంచైజీ ఓనర్ కావ్య మారన్ అంటే క్రికెట్ అభిమానులకు హాట్ ఫెవరేట్ అయిపోయింది. ఐపీఎల్‌ క్రికెట్ ఫ్యాన్స్ ఆమెకు ముద్దు పేరు కూడా పెట్టేశారు. మా కావ్య పాప మొఖంలో సంతోషం చూడటం కోసమే క్రికెట్ మ్యాచ్లు చూస్తున్నామంటూ చెప్పుకొస్తున్నారు. ఎస్ఆర్హెచ్ మ్యాచ్‌లు జరిగిన స్టేడియంలో ప్రతీ బాల్ కి కావ్య పాప ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంటే అభిమానులు తెగ ఎంజాయ్ చేస్తుంటారు.

Read Also: Pakistan : పాకిస్తాన్‌లో ముస్లిమేతరులపై క్రైస్తవులపై గుంపు దాడులు.. ఇళ్లు, ఫ్యాక్టరీలకు నిప్పు

అయితే, ఈ రోజు జరిగే ఫైనల్ ఫైట్ లో కోల్‌కత్త నైట్ రైడర్స్ జట్టుతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ తలపడబోతుంది. తాజాగా, నెట్టింట సన్‌రైజర్స్ హైదరాబాద్‌ ఓనర్ కావ్య మారన్ పర్సనల్ లైఫ్ గురించి ఓ వార్త చక్కర్లు కొడుతుంది. కావ్య మారన్ ఇప్పటికే చాలా మందితో డేటింగ్ చేసిందంటూ అనే రూమర్స్ వస్తున్నాయి. రిసెంట్ గా 23 ఏళ్ల రైజర్స్ ప్లేయర్స్ తో కావ్య మారన్ ప్రేమలో పడిందనే న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అయితే, అభిషేక్ శర్మతో కావ్య పాప చాలా క్లోజ్ గా ఉంటుంది. ఈ యంగ్ స్టార్ చాలా ఏళ్లుగా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున ఆడుతున్నాడు. ఈ జట్టులోని స్టార్ ప్లేయర్స్ ని తొలగించిన కావ్య మారన్.. అతడ్ని మాత్రం కంటిన్యూ చేస్తుంది. దీంతో వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోంది అనే ప్రచారం నెట్టింట తెగ ప్రచారం కొనసాగుతుంది.