NTV Telugu Site icon

Abhishek Sharma: మోడల్ ఆత్మహత్య.. చిక్కుల్లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ ప్లేయర్!

Abhishek Sharma

Abhishek Sharma

Abhishek Sharma to be interrogated in Tania Singh suicide: పంజాబ్ క్రికెటర్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆల్‌రౌండర్‌ అభిషేక్‌ శర్మ చిక్కుల్లో పడ్డాడు. సూరత్‌కు చెందిన మోడల్‌ తానియా సింగ్‌ ఆత్మహత్య కేసులో అభిషేక్‌కి పోలీసులు నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొన్నారు. ప్రముఖ మోడల్‌ తానియా సింగ్‌ ఇటీవల లేటు రాత్రి ఇంటికి వచ్చి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ కేసు విచారణలో భాగంగా పోలీసులు అతడికి నోటీసులు పంపారు.

తానియా సింగ్‌ ఆత్మహత్యకు పాల్పడే ముందు.. చివరిసారిగా క్రికెటర్ అభిషేక్‌ శర్మకు ఫోన్‌ చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తానియా కాంటాక్ట్‌ హిస్టరీ చెక్‌ చేసిన పోలీసులు.. అభిషేక్‌ శర్మను విచారణకు పిలిచారు. విచారణలో భాగంగా పోలీసులకు అభిషేక్‌ పూర్తిగా సహకరిస్తున్నాడని సమాచారం. తానియా తనకు స్నేహితురాలు మాత్రమే అని, చాలా కాలంగా ఆమెతో టచ్‌లో లేనని అభిషేక్‌ పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది.

రాజస్థాన్‌కు చెందిన తానియా సింగ్.. సూరత్‌లోని వేసు ప్రాంతంలోని హ్యాపీ ఎలిగాన్స్‌లో నివాసం ఉంటోంది. గత 18 నెలలుగా ఫ్యాషన్ డిజైన్ మరియు మోడలింగ్‌ను ఆమె అభ్యసిస్తోంది. డీజే, మెకప్‌ ఆర్టిస్ట్‌గానూ ఆమెకు మంచి అనుభవం ఉంది. సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే తానియా తన అపార్ట్మెంట్లోనే ఆత్మహత్య చేసుకుంది.

Also Read: iPhone in Water: మీ ‘ఐఫోన్‌’ నీటిలో పడిందా?.. ఇలా అస్సలు చేయొద్దు!

పంజాబ్‌కు చెందిన 23 ఏళ్ల అభిషేక్‌ శర్మ రంజీ ట్రోఫీ 2023-24 సీజన్‌లో పాల్గొన్నాడు. పంజాబ్‌ తరఫున 4 మ్యాచ్‌లు ఆడిన అభిషేక్‌.. 199 పరుగులు, మూడు వికెట్లు తీశాడు. అభిషేక్‌ లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ అన్న విషయం తెలిసిందే. రంజీ ట్రోఫీలో పంజాబ్‌ గ్రూపు దశలోనే నిష్క్రమించడంతో.. ఐపీఎల్‌ 2024 కోసం ప్రాక్టీస్ మొదలుపెట్టేందుకు సిద్దమయ్యాడు. ఇంతలోనే అతడికి నోటీసులు అందాయి.