Site icon NTV Telugu

Sreenivasa Prasad: కేంద్ర మాజీ మంత్రి శ్రీనివాస ప్రసాద్‌ కన్నుమూత

Seee

Seee

కర్ణాటకలోని చామరాజనగర్‌కు చెందిన బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి శ్రీనివాస్ ప్రసాద్ (76) కన్నుమూశారు. ఓ ప్రైవేటు ఆస్పత్రికిలో చకిత్స పొందుతూ సోమవారం మృతిచెందినట్లుగా కుటుంబ సభ్యులు ప్రకటించారు. శ్రీనివాస్ ప్రసాద్.. చామరాజనగర్ నియోజకవర్గం నుంచి ఆరుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. మైసూర్ జిల్లా నంజనగూడ నుంచి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా కూడా పని చేశారు.

ఇది కూడా చదవండి: Singareddy Satish Reddy: ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం జగన్ నైజం…

అనారోగ్యంతో ఆయన ఇటీవల బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. శ్రీనివాస ప్రసాద్‌కు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. తన 50 ఏళ్ల రాజకీయ జీవితం నుంచి విరామం తీసుకుంటున్నట్లు గత నెల 18నే ప్రకటించారు. 1976లో జనతా పార్టీతో రాజకీయాల్లోకి వచ్చారు. అనంతరం 1979లో కాంగ్రెస్‌లో చేరారు. బీజేపీలో చేరడానికి ముందు కొన్నాళ్లు జేడీఎస్‌, జేడీయూ, సమతా పార్టీలోనూ పని చేశారు. అటల్‌ బిహారీ వాజ్‌పేయీ ప్రధానిగా ఉన్న 1999-2004 సమయంలో కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార పంపిణీ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం కాంగ్రెస్‌లో చేరి 2013లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. సిద్ధరామయ్య ప్రభుత్వంలో రెవెన్యూ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా పనిచేశారు. 2016లో తిరిగి కాషాయ గూటికి చేరారు. 2017లో నంజన్‌గుడ్‌ అసెంబ్లీ ఉప ఎన్నికలో ఓడిపోయారు. 2019లో చామరాజనగర్‌ నుంచి ఎంపీగా గెలుపొందారు.

ఇది కూడా చదవండి: Singareddy Satish Reddy: ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం జగన్ నైజం…

శ్రీనివాస్ ప్రసాద్ మృతిపై ప్రధాని మోడీ, కేంద్రమంత్రులు సంతాపం తెలిపారు. అలాగే రాష్ట్ర నాయకులు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు సానుభూతిని వ్యక్తం చేశారు.

Exit mobile version