Site icon NTV Telugu

Sreeleela: శ్రీలీలకు బంపరాఫర్.. సూపర్ హిట్ హీరోతో ఛాన్స్?

Sreeleela

Sreeleela

యంగ్ బ్యూటీ శ్రీలీల ప్రస్తుతం నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతున్నారు. పుష్ప 2 ‘కిస్సిక్’ సాంగ్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. ఇదే జోష్‌లో బాలయ్య బాబు ‘అన్‌స్టాపబుల్’ షోకి కూడా హాజరయ్యారు. అయితే ఈ షోకే ఎవరూ ఊహించని యంగ్ హీరోతో శ్రీలీల వెళ్లారు. అతడే యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి. ఈ ఇద్దరు ఇప్పటి వరకు ఒక్క సినిమాలో కూడా కలిసి నటించలేదు. గతంలో ‘అనగనగా ఒక రాజు’ సినిమాలో ఈ జంట నటించాల్సింది కానీ.. కుదరలేదు. ఈ సినిమా అటకెక్కిందనే టాక్ కూడా ఉంది. త్వరలో ఈ కాంబో సెట్ అవుతుందో లేదో తెలియదు గానీ.. అన్‌స్టాపబుల్ షోకి నవీన్, శ్రీలీల హాజరయ్యారు.

సరికొత్త పంథాలో దూసుకుపోతున్న బాలయ్య.. అన్‌స్టాబుల్ సీజన్ 4లో నవీన్, శ్రీలీలతో రచ్చ చేయనున్నారు. త్వరలో ఆహాలో స్ట్రీమింగ్‌కు రానున్న ఈ ఎపిసోడ్ షూటింగ్ కూడా జరుపుకుంది. ఇదిలా ఉంటే.. శ్రీలీలకు ఓ బంపరాఫర్ వచ్చినట్టుగా తెలుస్తోంది. తెలుగులో రాబిన్ హుడ్, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు చేస్తున్న శ్రీలీల.. ఇప్పుడు కోలీవుడ్‌లో అడుగుపెట్టడానికి రెడీ అవుతున్నారు. గతంలో దళపతి విజయ్ నటించిన ‘గోట్’ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం శ్రీలీను సంప్రదించగా నో చెప్పారు. కానీ ఈసారి హీరోయిన్‌గా శివ కార్తికేయన్‌తో ఛాన్స్ కొట్టేసినట్టుగా తెలుస్తోంది.

Also Read: Mahesh Babu: హిందీ బిగ్‌బాస్‌లో మహేష్ బాబు టాపిక్.. సల్మాన్ ఖాన్ ఏమన్నారంటే?

శివ కార్తికేయన్‌ ఇటీవల అమరన్‌ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ తర్వాత లేడీ డైరెక్టర్ సుధా కొంగరతో ఓ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. ‘పురనానూరు’ టైటిల్‌తో చారిత్రక నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో శ్రీలీల ఫైనల్ అయినట్టుగా తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుందని సమాచారం. ఏదేమైనా.. శ్రీలీల ఓ రేంజ్‌లో దూసుకుపోతోందనే చెప్పాలి. రాబిన్ హుడ్, ఉస్తాద్ భగత్ సింగ్ హిట్ అయితే ఆమెను ఆపడం ఎవరివల్ల కాదు.

Exit mobile version