Site icon NTV Telugu

Sreeleela Remuneration: భారీగా తగ్గిన శ్రీలీల రెమ్యునరేషన్.. కారణం అదేనా..!

Sreeleela Remuneration

Sreeleela Remuneration

Sreeleela Remuneration: టాలీవుడ్ లో అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన వారిలో శ్రీలీల ఒకటిగా చెప్పవచ్చు. ఎంట్రీతోనే స్టార్ హీరోలతో జతకట్టిన ఈ ముద్దుగుమ్మ.. తన గ్లామర్ డాన్స్ తో తిరుగులేని ఫ్యాన్ బేస్ ని సంపాదించుకుంది. కానీ ప్రస్తుతం కెరియర్ గ్రాఫ్ కాస్త డౌన్ అయిందనే చెప్పాలి. ఆమెకు వరుస సినిమా అవకాశాలు వస్తున్నప్పటికీ.. హిట్లు మాత్రం పడటం లేదు. దీంతో ఇప్పుడు శ్రీలీల అయోమయంలో పడిపోయిందనే చెప్పవచ్చు.

Anil Ravipudi: నన్ను రాజమౌళి‎తో పోల్చకండి ప్లీజ్.. అది ఆయన స్థాయిని తగ్గించడమే అవుతుంది..!

అంతేకాదు ఈ ఫెయిల్యూర్ ఎఫెక్ట్స్ ఏకంగా తన రెమ్యునరేషన్ మీదే పడిందంటే నమ్మండి. ఇటీవల శ్రీలీల ‘పరాశక్తి’ సినిమాతో తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. సుధా కొంగర దర్శకత్వంలో శివకార్తికేయన్ హీరోగా నటించిన ఈ భారీ బడ్జెట్ చిత్రం జనవరి 10న విడుదలయింది. అయితే ఈ సినిమాకు శ్రీలీల తీసుకున్న పారితోషకం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇదివరకు రవితేజ వంటి స్టార్ హీరోల సరసన నటించినప్పుడు మూడు నుంచి నాలుగు కోట్ల రూపాయల వరకు వసూలు చేసిన ఈ బ్యూటీ.. పరాశక్తి సినిమాకు మాత్రం కేవలం కోటి రూపాయలే తీసుకున్నట్లు సమాచారం.

Bheems Ceciroleo: నాన్న.. నన్ను నువ్వు దేనికి పనికి రావు అన్నావు కదా.. ఇప్పుడు చూడు ఎక్కడనున్నానో..!

తెలుగులో ఆమె చేసిన జూనియర్, రాబిన్ హుడ్ వంటి సినిమాలకు భారీ మొత్తంలో ఛార్జ్ చేసిన శ్రీలీల కాలీవుడ్ ఎంట్రీ కోసం ఇంతలా తగ్గించుకోవడం ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. వరుసగా వచ్చిన ఫ్లాప్స్ ఒక కారణం అయితే.. కాలీవుడ్ మార్కెట్ లో నిలదొక్కుకోవాలనే ఉద్దేశంతోనే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పుష్ప 2 లో స్పెషల్ సాంగ్ తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం బాలీవుడ్ లో కార్తీక్ ఆర్యన్ సరసన కూడా నటిస్తుంది. మరి ఈ పారితోషకం తగ్గింపు శ్రీలీల కెరియర్ ను ఏ మేరకు ప్లస్ అవుతుందో చూడాలిమరి.

Exit mobile version