టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల కెరీర్ ప్రస్తుతం అయేమయ స్థితిలో ఉంది. ఎందుకంటే కెరీర్ బిగినింగ్ తో పోల్చుకుంటే ప్రజంట్ ఆమె గ్రాఫ్ చాలా పడిపోయింది. వరుస పరాజయాలు ఎదురుకుంటున్న ఈ ముద్దుగుమ్మ.. ఇటీవలే ‘పరాశక్తి’ సినిమాతో కోలీవుడ్‌లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది. శివకార్తికేయన్ సరసన నటించిన ఈ చిత్రంలో శ్రీలీల తన యాక్టింగ్ డాన్స్‌తో తమిళంలోను అలరించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాలను అందుకున్నప్పటికీ, శ్రీలీలకు మాత్రం అక్కడ మంచి గుర్తింపు లభించింది. ఈ క్రమంలోనే ఆమె మరో బిగ్ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.
Also Read : The Paradise : ప్యారడైజ్’లో మరో సర్‌ప్రైజ్ పాత్ర..!
‘లవ్ టుడే’ ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వంలో రూపొందనున్న ఒక భారీ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామాలో శ్రీలీల సెకండ్ హీరోయిన్‌గా ఎంపికైనట్లు సమాచారం. ఈ సినిమాలో ఇప్పటికే మీనాక్షి చౌదరిని ప్రధాన కథానాయికగా ఖరారు చేయగా, ఇప్పుడు శ్రీలీల కూడా చేరడంతో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు రెట్టింపయ్యాయి. ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటిస్తూ స్వయంగా దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని, ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ దాదాపు రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించనుంది. ‘గుంటూరు కారం’ సినిమాలో కలిసి నటించిన శ్రీలీల, మీనాక్షి చౌదరి.. ఇప్పుడు ప్రదీప్ రంగనాథన్ సరసన మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతుండటం విశేషం. సైన్స్ ఫిక్షన్.. కామెడీ అంశాలతో సాగే ఈ చిత్రం మార్చి నుంచి షూటింగ్ జరుపుకోనుంది. ప్రదీప్ మార్క్ యూత్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు తోడు శ్రీలీల గ్లామర్ తోడైతే కోలీవుడ్‌లో ఈ సినిమా సెన్సేషన్ సృష్టించడం ఖాయమని సినీ వర్గాలు అంటున్నాయి. త్వరలోనే ఈ క్రేజీ కాంబినేషన్‌పై అధికారిక ప్రకటన వెలువడనుంది.
