NTV Telugu Site icon

Sreeleela : అల్లు అర్జున్ కి అదిరిపోయే గిఫ్ట్స్ ఇచ్చిన శ్రీలీల

Sreeleela

Sreeleela

Sreeleela : టాలీవుడ్ ఇండస్ట్రీలో అనతి కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ శ్రీలీల. ప్రస్తుతం కమర్షియల్ హీరోయిన్ ఇమేజ్ సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ అమ్మడుకి కెరియర్ లో ఇప్పటి వరకు ధమాకా తర్వాత ఒక్క సక్సెస్ లభించలేదు. దీని తర్వాత ఈ ఏడాది సూపర్ స్టార్ మహేష్ బాబు ‘గుంటూరు కారం’ సినిమాతో శ్రీలీల ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ మూవీ సక్సెస్ అయ్యి ఉంటే అమ్మడి రేంజ్ మారిపోయేది. అయితే సినిమాలో ఆమె డాన్స్ కి మంచి గుర్తింపు వచ్చింది కానీ మూవీ స్ట్రాంగ్ గా పబ్లిక్ కి నచ్చేలేదు. దీంతో శ్రీలీలకు చెప్పుకోదగ్గ స్థాయిలో అవకాశాలు రాలేదు. ప్రస్తుతం ఆమె నితిన్ కి జోడీగా నటించిన ‘రాబిన్ హుడ్’ మూవీ డిసెంబర్ 20న విడుదల కానుంది. అంతకంటే ముందు డిసెంబర్ 5న రిలీజ్ కాబోయే మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పుష్ప 2’లో స్పెషల్ సాంగులో ఆమె కనిపించబోతోంది. రీసెంట్ ఈ సాంగ్ ను శ్రీలీల పూర్తి చేసింది. ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ డాన్సర్స్ లలో ఒకడైన అల్లు అర్జున్ తో కలిసి శ్రీలీల ఈ సాంగ్ కోసం అదిరిపోయే స్టెప్పులు వేయడంతో అందరికి ఆసక్తి క్రియేట్ అయింది.


ఇద్దరు టాలెంటెడ్ డాన్సర్లు కలిసి స్టేజీ మీద డ్యాన్స్ వేస్తుంటే చూడాలని ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ సాంగ్ పూర్తి అయిన తర్వాత శ్రీలీల అల్లు అర్జున్ తో పాటు అతని భార్య స్నేహారెడ్డి, వారి పిల్లలకి అదిరిపోయే గిఫ్ట్స్ ఇచ్చింది. కలర్ లెటర్స్ పై తన అభిప్రాయాలని రాసి గిఫ్ట్ ప్యాక్స్ గా వారికి పంపించింది. అల్లు అర్జున్ ఇన్ స్టాగ్రాంలో వాటిని షేర్ చేసి శ్రీలీలకి థాంక్స్ చెప్పాడు. ఆమెని డ్యాన్సింగ్ క్వీన్ గా అభివర్ణిస్తూ అల్లు అర్జున్ స్టేటస్ పెట్టడం విశేషం. నువ్వు పంపించిన గిఫ్ట్స్ ఇప్పుడే చూశాను. అందులో నువ్వు రాసిన లెటర్ నా మనసుని తాకింది. నీ ప్రేమకి నా కృతజ్ఞతలు అంటూ బన్నీ మెన్షన్ చేశాడు. అలాగే ఆమె రాసిన లెటర్స షేర్ చేశాడు. అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి కూడా శ్రీలీల పంపించిన లెటర్ ని ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అందులో స్నేహా రెడ్డి ఆతిథ్యానికి శ్రీలీల థాంక్స్ చెప్పింది. తనని అద్భుతంగా ఆదరించిన ఫ్యామిలీ మొత్తానికి శ్రీలీల లెటర్ థాంక్స్ చెప్పింది. ‘పుష్ప 2’ మూవీ విడుదల కోసం వెయిట్ చేస్తూ ఉంటానని మరో లెటర్ కూడా అల్లు అర్జున్ కి పంపించింది.

Show comments