సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలీల నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గుంటూరు కారం ‘.. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకేక్కుతుంది.. ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఈ ఏడాది సంక్రాంతి కానుకగా 12 న విడుదల చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.. ఈమేరకు తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గుంటూరులో గ్రాండ్ గా నిర్వహించారు.. ఈ ఈవెంట్ టీమ్ తో పాటుగా సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు..
ప్రముఖ నిర్మాత దిల్ రాజు ముఖ్య అతిధిగా విచ్చేయగా.. ఈవెంట్లో మహేష్ ఎమోషనల్ అయ్యాడు. తన లకు ఎప్పుడూ రివ్యూ చెప్పే తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ ఇక లేరని.. ఇకపై ప్రేక్షకులు, అభిమానులే తనకు అమ్మ నాన్న అంటూ భావోద్వేగానికి గురయ్యాడు మహేష్. అంతకు ముందు గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ స్టేజ్ పై తన మాటలతో ఆకట్టుకుంది హీరోయిన్ శ్రీలీల.. స్టేజ్ మీద అమ్మడు సెంటర్ ఆఫ్ అట్రాక్షణ్ గా నిలిచింది..
ట్రెండీ శారీలో మరింత స్టైలీష్ లుక్లో మెరిసిపోయింది శ్రీలీల. బాటిల్ కలర్ గడుల చీరలో స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. శ్రీలీల కట్టుకున్న చీర కాస్త డిఫరెంట్ గా కనిపించడంతో ఇప్పుడు ఆ శారీ ధర.. వివరాల గురించి నెట్టింట సెర్చింగ్ స్టార్ట్ చేశారు నెటిజన్స్.. చివరకు ఆ చీర ధర విని ఖంగు తిన్నారు.. ఆ చీర ధర లక్షల్లో ఉంది.. చూడటానికి ఎంతో సింపుల్గా ఉన్న ఈ చీర ధర రూ. 1.59.000 అని తెలిసి నెటిజన్స్ అవాక్కవుతున్నారు. అంత ఖరీదైన చీర శ్రీలీల కట్టుకోవడంతో ఆ చీరకే అందం వచ్చిందని ఆమె ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు.. ఇక ఈ సినిమా కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు..