Site icon NTV Telugu

#D55: ధనుష్ సరసన శ్రీలీల.. #D55 క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది!

Sreeleela Dhanush Movie, #d55 Movie

Sreeleela Dhanush Movie, #d55 Movie

తెలుగులో తన డ్యాన్స్‌లు, నటనతో కుర్రాళ్ల గుండెల్లో గుడి కట్టుకున్న శ్రీలీల, ఇప్పుడు కోలీవుడ్‌లో సెటిల్ అవ్వడానికి సిద్ధమవుతోంది. తాజాగా ధనుష్ హీరోగా నటిస్తున్న 55వ చిత్రం (#D55)లో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్నట్లు నిర్మాణ సంస్థ వండర్ బార్ ఫిల్మ్స్ (Wunderbar Films) సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. “మీరు ఇది ఊహించి ఉండరు కదా ” అంటూ చిత్ర బృందం విడుదల చేసిన పోస్టర్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

Also Read : Anil Ravipudi : హీరోయిన్ విషయంలో అనిల్ రావిపుడిని హెచ్చరిస్తున్న నెటిజన్లు ..

రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ధనుష్ వంటి విలక్షణ నటుడి పక్కన శ్రీలీల నటిస్తుండటంతో ఈ కాంబినేషన్ ఎలా ఉండబోతుందోనని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం వరుస తెలుగు సినిమాలతో బిజీగా ఉన్న శ్రీలీలకు, ఈ తమిళ ప్రాజెక్ట్ అక్కడ కూడా స్టార్ ఇమేజ్‌ను తెచ్చిపెట్టడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తుండగా, త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

 

Exit mobile version