Site icon NTV Telugu

Vishnu Vinyasam Teaser: శ్రీవిష్ణు ‘విష్ణు విన్యాసం’ టీజర్ మామూలుగా లేదుగా!

Vishnu Vinyasam

Vishnu Vinyasam

Vishnu Vinyasam Teaser: వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో శ్రీవిష్ణు. ఈ హీరో మరోసారి తన మార్క్ కామెడీ, ఎంటర్టైన్మెంట్‌తో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయ్యారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘విష్ణు విన్యాసం’. తాజాగా విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. సుమారు 2 నిమిషాలు ఉన్న ఈ టీజర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ ఫన్‌గా సాగింది. టీజర్‌లో శ్రీవిష్ణు నటన, డైలాగ్ డెలివరీ చాలా నేచురల్‌గా ఉన్నాయి. ముఖ్యంగా “మందు తెచ్చాను తాగుదాం దా” అంటూ మొదలయ్యే సీన్ నుంచి చివరి వరకు ఆయన ఎనర్జీ అదిరిపోయింది.

READ ALSO: Ambati Rambabu: జైలు నుంచి విడుదలైన అంబటి రాంబాబు..

హీరోహీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ బాగుంది. ముఖ్యంగా ‘జున్ను’, ‘చిన్ను’ అని ముద్దు పేర్లతో పిలుచుకునే సీన్లు యూత్‌ను ఆకట్టుకుంటాయి. టీజర్‌లో నేపథ్య సంగీతం, విజువల్స్ చాలా కలర్‌ఫుల్‌గా ఉన్నాయి. మొత్తానికి వరుస హిట్ల తర్వాత శ్రీవిష్ణు నుంచి వస్తున్న ఈ ‘విష్ణు విన్యాసం’ టీజర్ ప్రామిసింగ్‌గా కనిపిస్తోంది. దీనిని బట్టి చూస్తే శ్రీవిష్ణు తన మార్క్ కామెడీతో బాక్సాఫీస్ వద్ద మరోసారి విన్యాసాలు చేయడం ఖాయమనిపిస్తోంది. ఈ సినిమాలో హీరో శ్రీవిష్ణు సరసన హీరోయిన్‌‌గా నయన్‌ సారిక అలరించనుంది. ఈ చిత్రానికి యదునాథ్‌ మారుతి రావు దర్శకత్వం వహించారు. ఈనెల 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

READ ALSO: Bhagyashri Borse: సిద్ధూతో జతకట్టబోతున్న భాగ్యశ్రీ బోర్సే.. ఆ నిర్మాణ సంస్థలో హ్యాట్రిక్ సినిమా!

Exit mobile version