Site icon NTV Telugu

Squid Game 3: స్క్విడ్ గేమ్ 3 స్ట్రీమింగ్ డేట్ ప్రకటన.. ఎప్పుడంటే?

Squid Game 3

Squid Game 3

“స్క్విడ్ గేమ్‌” గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ వెబ్‌ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా అపారమైన క్రేజ్‌ను సంపాదించుకుంది. సౌత్ కొరియా నుంచి వచ్చిన ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతూ 2021లో విడుదలైన మొదటి సీజన్‌తోనే ప్రేక్షకులను తనదైన శైలిలో ఆకట్టుకుంది. దానికి సీక్వెల్‌గా రూపొందిన ‘స్క్విడ్‌ గేమ్‌ 2’ గతేడాది చివరిలో విడుదలైన సంగతి తెలిసిందే. ‘స్క్విడ్ గేమ్‌ సీజన్ 2’ మరోసారి ప్రేక్షకులను కట్టిపడేసింది. రెండో సీజన్ మొదటి వారంలోనే 68 మిలియన్ల వ్యూస్ సంపాదించింది. ఏకంగా 92 దేశాల్లో నెట్‌ఫ్లిక్స్‌ ర్యాంకింగ్స్‌లో మొదటి స్థానంలో నిలిచింది. భాషతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఈ వెబ్‌ సిరీస్‌ను ఆసక్తిగా వీక్షిస్తున్నారు.

READ MORE: Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌

ఇదిలా ఉండగా.. తాజాగా సీజన్‌ 3 విడుదలపై హింట్‌ ఇస్తూ వచ్చిన ఓటీటీ సంస్థ ‘నెట్‌ఫ్లిక్స్‌’ తాజాగా స్ట్రీమింగ్‌ డేట్‌ ఫిక్స్‌ చేసింది. జూన్ 27 నుంచి కొత్త సీజన్ స్ట్రీమింగ్ కానున్నట్లు ఆ ఓటీటీ తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. రెండో సీజన్ తీసుకురావడంతో కొంత సమయం పట్టింది. కానీ.. మూడో సీజన్ మాత్రం త్వరగా వస్తుండటంతో ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఫైనల్ గేమ్ కోసం సిద్ధంగా ఉండండి అంటూ ఓ పోస్టర్ ను కూడా పోస్ట్ చేసింది.

READ MORE: Hamas-Israel: బందీల విడుదలలో గందరగోళం.. షాకిచ్చిన ఇజ్రాయెల్

Exit mobile version