Hamas-Israel: బందీల విడుదలలో గందరగోళం.. షాకిచ్చిన ఇజ్రాయెల్
- బందీల విడుదలలో గందరగోళం
- హమాస్ ఉగ్రవాదులు వికృత చర్యలు
- షాకిచ్చిన ఇజ్రాయెల్.. పాలస్తీనా ఖైదీల నిలిపివేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హమాస్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. దీంతో బందీల విడుదలకు హమాస్ అంగీకరించడం.. పాలస్తీనా ఖైదీల విడుదలకు ఇజ్రాయెల్ సమ్మతి తెల్పడంతో కొద్దిరోజులుగా ఒప్పందం సాఫీగా సాగుతోంది. అయితే గురువారం బందీల విడుదల సమయంలో హమాస్ అనుచితంగా ప్రవర్తించింది. హమాస్ ఉగ్రవాదులు.. మహిళ బందీ చుట్టుముట్టారు. దీంతో ఆమె విలవిలలాడిపోయింది. కన్నీళ్లు పెట్టుకుంది. తీవ్ర ఇబ్బందులకు గురిచేసినట్లుగా వీడియోలో కనిపించింది. ఈ పరిణామాన్ని ఇజ్రాయెల్ తీవ్రంగా పరిగణించింది. హమాస్ ఉగ్రవాదుల తీరుతో మార్పిడి విధానాన్ని ఇజ్రాయెల్ తాత్కాలికంగా నిలిపివేసింది. హమాస్ బందీల అప్పగింతను ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు తీవ్రంగా ఖండించడంతో పాలస్తీనా ఖైదీల మార్పిడిని తాత్కాలికంగా నిలిపివేసింది.

Also Read
- Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
- Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
- Imran Khan Release Protest: ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం భారీ ఉద్యమం.. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్, 2 వేల మంది అరెస్ట్
- Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
గురువారం హమాస్ ఎనిమిది మంది బందీలను విడుదల చేసింది. వీరిలో ఒక ఇజ్రాయెలీ మహిళా సైనికురాలు(29), 80 ఏళ్ల ఇజ్రాయెల్ వ్యక్తి, ఐదుగురు థాయ్ కార్మికులు ఉన్నారు. ఇక 20 ఏళ్ల అగామ్ బెర్గర్ సైనికుడిని ముందుగానే విడుదల చేశారు. అయితే బందీల విడుదల సమయంలో హమాస్ ఉగ్రవాదులు వికృతంగా ప్రవర్తించారు. ఈ చర్యను ఇజ్రాయెల్ తీవ్రంగా ఖండించింది. బందీల భద్రతపై ఇజ్రాయెల్ ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో పాలస్తీనా ఖైదీల విడుదలను తాత్కాలికంగా నిలిపివేసింది. ఇదిలా ఉంటే హమాస్.. ఇప్పటి వరకు 15 మంది బందీలను విడుదల చేసింది. గురువారం ఇజ్రాయెల్ కూడా 115 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేయాల్సి ఉంది. కానీ వారిని ఇంకా విడుదల చేయలేదు. బందీల భద్రతపై అంతర్జాతీయ మధ్యవర్తులు జోక్యం చేసుకోవాలని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు పిలుపునిచ్చారు.
مباشرة لحظة تسليم المحتجزة الإسرائيلية أربيل يهودا إلى الصليب الأحمر في #خانيونس pic.twitter.com/3Wpc4c5j36
— #القدس_ينتفض 🇵🇸 (@MyPalestine0) January 30, 2025


తాజావార్తలు
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!