Site icon NTV Telugu

Spy : ఓటీటీలో రిలీజ్‌కు రెడీ అవుతున్న స్పై..ఎక్కడంటే?

Spy Movie

Spy Movie

యంగ్ హీరో నిఖిల్ తాజాగా నటించిన పాన్ ఇండియా చిత్రం స్పై. ఈ సినిమా నిన్నటి రోజున మంచి బజ్ తో చాల గ్రాండ్ గా విడుదల కావడం జరిగింది.. అయితే విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.. రొటీన్ కథలతో కాకుండా డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ లు చేసి టాలీవుడ్ లో రాణిస్తున్నాడు. ఇక వరుసగా విజయాలను అందుకుంటున్న నిఖిల్.. రీసెంట్ గా చేసిన స్పై తో బోల్తాపడ్డాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దాంతో నిఖిల్ కూడా ప్రేక్షకులకు సారీ చెప్పాల్సి వచ్చింది.

డైరెక్టర్ గ్యారీ బిహెచ్ దర్శకత్వం లో తెరకెక్కించారు. ఇందులో హీరోయిన్గా ఐశ్వర్య మీనన్ నటించింది. స్పై సినిమాలో యాక్షన్ సీక్వెల్స్ అదిరిపోయాయని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రేక్షకులు యాక్షన్ అంచనాల తో త్రిల్ చేసినట్లుగా కూడా తెలుస్తోంది.. ఈ సినిమాను ఇప్పుడు ఓటీటిలో విడుదల చెయ్యనున్నారు.. ఈ సినిమాను ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ పై క్లారిటీ వ‌చ్చేసింది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజ్‌కానుంది. జూలై ఎండింగ్ లేదా ఆగ‌స్ట్ ఫ‌స్ట్‌వీక్‌లో స్పై ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం.

కార్తికేయ -2 తో నిఖిల్‌కు పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో మార్కెట్ ఏర్ప‌డ‌టంతో స్పై డిజిట‌ల్, శాటిలైట్ రైట్స్ క‌లిపి దాదాపు న‌ల‌భై కోట్లకుపైనే అమ్ముడుపోయిన‌ట్లు స‌మాచారం నిఖిల్ కెరీర్‌లో ఇదే హ‌య్యెస్ట్ అని ప్ర‌చారం జ‌రుగుతోంది.. అయితే ఇప్పుడు మరో వార్త చక్కర్లు కొడుతుంది.. స్పై ను జులై 29 న ఓటీటీ లో రిలీజ్ చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. ఈ నెల 29న అమెజాన్ ప్రైమ్ లో స్పై స్ట్రీమింగ్ కానుందని టాక్. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం మరో సినిమాలో నటిస్తున్నాడు..

Exit mobile version