NTV Telugu Site icon

Twitter Logo: ట్విట్టర్ భవనంపై ‘X’ లోగో.. విచారణ ప్రారంభించిన శాన్ ఫ్రాన్సిస్కో అధికారులు

Violation Of X Logo

Violation Of X Logo

Twitter Logo: ఎలాన్ మస్క్ ట్విట్టర్‎ను హస్తగతం చేసుకున్న తర్వాత నిరంతరం మార్పులు చేస్తూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు అనూహ్య నిర్ణయాలు తీసుకుంటూ చిక్కులను కొని తెచ్చుకుంటున్నారు. ఇటీవలే ఆయన ఎన్నో ఏళ్ల నుంచి ట్విట్టర్‌ లోగోగా ఉన్న పిట్టను తొలగించి.. Xను ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. అలాగే వెబ్‌సైట్‌ను కూడా X.com మార్చారు. చట్టపరమైనటువంటి అనుమతులు తీసుకోకుండగానే ఎలాన్ మస్క్ లోగో మార్పు నిర్ణయాన్ని తీసుకున్నారు. దీంతో ఇప్పుడు మస్క్ చట్టపరమైన చిక్కులను ఎదుర్కుంటున్నాడు.

Read Also:Kanika Mann Pics: రెడ్ శారీలో హాట్ మిర్చిలా కనికా మన్.. బ్లాస్టింగ్ స్టిల్స్ వైరల్!

నిబంధనల ప్రకారం.. ఒక సంస్థ లోగో కానీ దాని గుర్తును కానీ మార్చాలనుకుప్పుడు తప్పనిసరిగా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ అవేమీ పట్టించుకోకుండా ఎలాన్ మస్క్ ట్విట్టర్ లోగోను మార్చేశారు. ట్విట్టర్ హెడ్ క్వార్టర్స్‌పై ఉన్న పిట్ట బొమ్మను కూడా తొలగించి ఎక్స్‌ లోగోను ఏర్పాటు చేశారు. దీంతోనే ఎలాన్ మస్క్‎కు చిక్కులు మొదలయ్యాయి. దీనిపై శాన్‌ఫ్రాన్సిస్కో అధికారులు విచారణకు ఆదేశించారు. వెంటనే సమాధానం చెప్పాలంటూ ట్విట్టర్ బాసుకు నోటీసులు పంపించారు. లోగో డిజైన్, భద్రతా కారణాల దృష్ట్యా తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు. ఇక మరోవైపు ట్విట్టర్‌ లోగో ఛేంజ్ చేసి ఎక్స్ పెట్టడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లవెత్తుతున్నాయి. ట్విట్టర్ లోగోగా పిట్ట బొమ్మనే కొనసాగించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

Read Also:Manipur Video Case: మణిపూర్ వైరల్ వీడియో.. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీబీఐ