Site icon NTV Telugu

Sportstar Sports Conclave: రేపే హైదరాబాద్‌లో ‘స్పోర్ట్‌స్టార్ స్పోర్ట్స్ కాన్‌క్లేవ్‌’.. ముఖ్య అతిథులు వీరే!

Sportstar Sports Conclave

Sportstar Sports Conclave

Sportstar Sports Conclave in Telangana State on August 31: భారతీయ క్రీడా పత్రిక ‘స్పోర్ట్‌స్టార్’ దేశవ్యాప్తంగా ప్రాంతీయ క్రీడా సమ్మేళనాలను నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. భారతదేశంలో క్రీడా విప్లవాన్ని వేగవంతం చేయడానికి ప్రతి రాష్ట్రంలోని క్రీడలకు సంబందించిన వ్యక్తులతో ‘స్పోర్ట్స్ కాన్‌క్లేవ్‌’ నిర్వహిస్తోంది. ఇందులో రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం మరియు కార్పొరేట్ సంస్థలు ఎలా ఉపయోగపడాలో అనే సూచనలు ఇస్తారు. ఈ క్రమంలో ‘స్పోర్ట్స్ కాన్‌క్లేవ్‌’ ఈసారి తెలంగాణ రాష్ట్రంలో జరగనుంది.

స్పోర్ట్‌స్టార్ స్పోర్ట్స్ కాన్‌క్లేవ్‌ తెలంగాణ రాష్ట్రంలో గురువారం జరగనుంది. హైదరాబాద్‌లోని ఐటీసీ కాకతీయలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు స్పోర్ట్స్ కాన్‌క్లేవ్‌ జరగనుంది. అతిథులకు ఉదయం 10.45 నిమిషాల నుంచి లోపలికి అనుమతి ఉంటుంది. తెలంగాణ క్రీడలు మరియు యువజన వ్యవహారాల మంత్రి శ్రీనివాస్ గౌడ్, భారత మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్, హైదరాబద్ మాజీ క్రికెటర్ సీవీ ఆనంద్, బ్యాడ్మింటన్ ప్లేయర్ పారుపల్లి కశ్యప్, భారత మహిళా జట్టు మాజీ సారథి మిథాలీ రాజ్, ఎచ్‌సీఏ అధికారులు సహా కొందరు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.

Exit mobile version