2026 T20 World Cup: 2026 T20 ప్రపంచ కప్ నుంచి బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు బయటికి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఇండియాలో టీ20 ప్రపంచ కప్ మ్యాచ్‌లు ఆడటానికి భద్రతా కారణాలను సాకుగా చూపిన బంగ్లాదేశ్.. ఏకంగా టోర్నీ నుంచే దూరం అయిన సంగతి తెలిసిందే. ఇదే కారణాలను చూపి ఇప్పుడు ICC బంగ్లా స్పోర్ట్స్ జర్నలిస్టులను కూడా టోర్నీ నుంచి నిషేధించిందని పలు నివేదికలు సూచిస్తున్నాయి. టోర్నమెంట్‌ను కవర్ చేయడానికి బంగ్లాదేశ్ స్పోర్ట్స్ జర్నలిస్టులకు గుర్తింపు ఇవ్వడానికి ICC నిరాకరించింది. ఇది కేవలం భారతదేశంలో జరిగే మ్యాచ్‌లకే పరిమితం కాదు, శ్రీలంకలో జరిగే మ్యాచ్‌లను కూడా కవర్ చేయకుండా బంగ్లాదేశ్ జర్నలిస్టులను ICC బ్యాన్ చేసింది.
READ ALSO: Mohan Babu: బెంగాల్ గవర్నర్ ఎక్స్‌లెన్స్ అవార్డు అందుకున్న మోహన్ బాబు
ఈ విషయంపై ఇప్పటి వరకు ఐసీసీ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. భారతదేశం-శ్రీలంక మ్యాచ్ కవరేజ్ కోసం బంగ్లాదేశ్ స్పోర్ట్స్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్ ఇవ్వడానికి ఐసిసి నిరాకరించిందని పలు నివేదికలు సూచిస్తున్నాయి. గతంలో బంగ్లాదేశ్ జట్టు భారతదేశంలో మ్యాచ్‌లు ఆడకూడదని పట్టుబట్టడంతో ICC ఆ జట్టును టోర్నమెంట్ నుంచి బహిష్కరించింది. ఈ మెగా టోర్నమెంట్‌లో బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
స్కాట్లాండ్ షెడ్యూల్
గ్రూప్ సిలో బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ జట్టు బరిలోకి దిగుతుంది. బంగ్లాదేశ్ జట్టు ఆడాల్సిన మ్యాచ్‌ల తేదీల్లోనే స్కాట్లాండ్ ఈ తమ మ్యాచ్‌లను ఆడుతుంది. స్కాట్లాండ్ ఫిబ్రవరి 7న వెస్టిండీస్‌తో తమ ఫస్ట్ మ్యాచ్‌లో బరిలోకి దిగుతుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 9న ఇటలీతో, ఫిబ్రవరి 14న ఇంగ్లాండ్‌తో తలపడుతుంది. ఆ తర్వాత చివరి గ్రూప్ మ్యాచ్ నేపాల్‌తో ఆడుతుంది.
READ ALSO: Pakistan: పాకిస్థాన్ సైన్యం దృష్టిలో మరొక పార్టీ.. అదే సీన్ రిపీట్ అవుతుందా?
