NTV Telugu Site icon

Viral Video: “టీ”లో ఉమ్మేసి కస్టమర్లకు ఇస్తున్న యువకులు.. వీడియో వైరల్

Viral Video

Viral Video

ఉత్తరాఖాండ్‌లోని డెహ్రాడూన్‌లో మరోసారి స్పిట్ టీ ఉదంతం చోటుచేసుకుంది. ఓ పాత్రలో ఉమ్మివేసి టీ అందిస్తున్న ఉదంతం ముస్సోరీలో వెలుగు చూసింది. ఈ ఘటనతో హిందూ సంస్థలలో కలకలం రేగింది. ఈ వీడియో వైరల్ కావడంతో ఇద్దరు యువకులపై పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. యువకుల పేర్లు నౌషాద్ అలీ, హసన్ అలీ. నిందితులిద్దరూ ఘటనా స్థలం నుంచి పరారీలో ఉన్నారు. ముస్సోరిలో టీపాట్‌లో ఉమ్మివేసి టీ అందిస్తున్న ఇద్దరు యువకులపై పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

READ MORE: Chilakaluripet: ఐసీఐసీఐ బ్యాంకులో 72 మంది డబ్బులు పోగొట్టుకున్నారు: సీఐడీ

ఈ మొత్తం వ్యవహారంపై నగర వాసుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాలకు చెందిన వారు డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ముస్సోరీలోని కితాబ్ ఘర్ చౌక్ వద్ద ఇద్దరు యువకులు పర్యాటకులకు టీ, కాఫీ, బ్రెడ్ తయారు చేసి విక్రయిస్తున్నారు. టీ తాగేందుకు షాప్‌కు వచ్చిన హిమాన్షు.. తాను టీ తాగేందుకు ఇక్కడికి వచ్చానని, అయితే టీ తయారు చేస్తున్న యువకుడు.. టీలో ఉమ్మి వేశాడు. దీంతో వీడియోలో ఈ దృశ్యం బయటపడింది. ఏంటని అడగ్గా.. దుర్భాషలాడాడు.

READ MORE:Ratan Tata: టాటా ఇండికా నుంచి నెక్సాన్ ఈవీ వరకు.. భారత ఆటో ఇండస్ట్రీపై చెరగని సంతకం రతన్ టాటా..

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీని కారణంగా నగరం మొత్తం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై హిమాన్షు బిష్ణోయ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్ ఇన్‌ఛార్జ్ అరవింద్ చౌదరి తెలిపారు. ఈ విషయంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం యువకులిద్దరూ పరారీలో ఉన్నారు. వీడియో వైరల్ కావడంతో.. పెద్ద సంఖ్యలో బిజెపి కార్యకర్తలు, భజరంగ్ దళ్ కార్యకర్తలు పోలీసు స్టేషన్‌కు చేరుకుని నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా.. నిందితులను పోలీసులు పట్టుకున్నట్లు సమాచారం.

Show comments