NTV Telugu Site icon

Chandrababu and BJP Leaders: సీఎం చంద్రబాబుకు బీజేపీ నేతల మూడు విజ్ఞప్తులు

Babu Bjp

Babu Bjp

Chandrababu and BJP Leaders: మాజీ సీఎం వైఎస్‌ జగన్ టార్గెటుగా పావులు కదుపుతోంది ఏపీ బీజేపీ.. గత ప్రభుత్వ హయాంలో జరిగిన భారీ కుంభకోణాలను వెలికి తీయాలని చంద్రబాబుకు ఏపీ బీజేపీ విజ్ఞప్తి చేసింది.. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు మూడు విజ్ఞప్తులు చేశారు బీజేపీ నేతలు.. గత ఐదేళ్లుగా రాష్ట్రంలో జరిగిన మద్యం, ఇసుక మాఫియాలపై సమగ్ర విచారణ జరిపాలని ఏపీ సీఎంకు బీజేపీ బృందం విజ్ఞప్తి చేసింది.. ఇప్పటికే ఏపీలోని మద్యం, ఇసుక మాఫియాలపై కేంద్రానికి పురంధేశ్వరి ఫిర్యాదు చేసిన విషయం విదితమే.. మరోవైపు.. బీజేపీ కార్యాలయం ఏర్పాటుకు స్థలం కోరుతూ మరో విజ్ఞాపన ఇచ్చారు నేతలు..

అయితే, ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి గురువారం రాత్రి వచ్చారు బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు.. బీజేపీ ప్రజా ప్రతినిధులకు చంద్రబాబు నివాసంలో ఆత్మీయ విందు ఇచ్చారు.. చంద్రబాబు నివాసానికి బీజేపీ ఎమ్మెల్యేలతో పాటు కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ, పురంధరేశ్వరి, సీఎం రమేష్ వచ్చారు.. ప్రతీ ఒక్కరికీ బొకే ఇచ్చి శాలువాతో సత్కరించారు చంద్రబాబు. తన చేత్తో ప్రతీ ఒక్కరికీ ప్లేట్లు అందచేస్తూ అందరితో కలిసి భోజనం చేశారు.. ఎన్నికలు జరిగిన తీరు, అంతా కలసి కట్టుగా పడిన కష్టం గురించి చంద్రబాబు బీజేపీ నేతల మధ్య చర్చ సాగింది.. ఐదేళ్ల వైసీపీ వేధింపులను సుజనా చౌదరి ప్రస్తావించగా.. అన్ని వర్గాలు ఇందులో బాధితులే అన్నారు చంద్రబాబు.. అనపర్తిలో ఉపాధి హామీ నిధులు జోడించి కాల్వల మరమ్మతులు చేపట్టానని నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి తెలిపగా.. నువ్వు ఎక్కడున్నా పని ప్రారంభించేస్తావంటూ అభినందించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ఇలా చంద్రబాబు నివాసంలో ఆత్మీయ విందు ఆసక్తికరంగా సాగింది.

కాగా, సీఎం చంద్రబాబుకు ఏపీ బీజేపీ చేసిన విజ్ఞప్తుల్లో.. ఇసుక తవ్వకాలకు డిజిటల్ చెల్లింపులు జరిగేలా చేయాలని కోరారు పురంధేశ్వరి.. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ప్రమాణాలను పాటిస్తూ ఇసుక తవ్వకాలు జరగాలి.. భారీ మెషీన్లతో ఇసుక తవ్వకాలు జరపకూడదు అని సూచించారు.. ఇదే సమయంలో గత ఐదేళ్లలో జరిగిన ఇసుక తవ్వకాలపై విచారణ జరిపించాలని కోరారు.. టాటా, బిర్లాల ద్వారా శుద్ధి చేసిన ఇసుక 25 కేజీల బస్తాలలో అందించేలా చూడాలన్నారు.. మరోవైపు.. మద్య నియంత్రణ, క్వాలిటీ లిక్కర్ పై చర్యలు తీసుకోవాలని సీఎంను కోరారు పురంధేశ్వరి.. ఇప్పటి వరకూ ఉన్న డిస్టిలరీస్ పై విచారణ జరిపించాలి.. ముడి సరుకుల వినియోగం, లిక్కర్ తయారీ పై విచారణ జరగాలన్నారు. ఇథనాల్ కంటే సగం ఖర్చుతో లభించే సింథటిక్ ఆల్కహాల్ వినియోగంపై విచారణ జరగాలి.. కాలం చెల్లిన డిస్టిలేషన్, శుద్ధి యంత్రాల వినియోగం పరిశీలించాలి.. కలర్, ఫ్లెవర్ల కోసం సింథటిక్ కెమికల్స్ వినియోగంపై విచారణ చేయించాలి.. 6 నుంచీ 12 నెలలు చెక్క బ్యారెల్స్ లో నిల్వ ఉంచిన ఆల్కహాల్ ను బాటిళ్ళలో నింపేలా చూడాలి.. శాంపిల్స్ ను ప్రతీవారం నేషనల్ లేబొరేటరీలలో పరీక్షలు జరిపించాలి.. డిజిటల్ చెల్లింపులను పూర్తిస్ధాయిలో అమలు పరచాలి.. పరివర్తన తీసుకొచ్చేందుకు రిహేబిలిటేషన్ సెంటర్లను రాష్ట్రం అంతా ప్రారంభించాలి.. బలవంతంగా లీజుకు తీసుకున్న లిక్కర్ తయారీ కేంద్రాలను తక్కువ రేట్లకే తిరిగి తీసుకోవాలి.. బ్రూవరీస్ కార్పొరేషన్ లో కరప్షన్ పై విచారణ జరిపించాలి అంటూ సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి.