NTV Telugu Site icon

SpiceJet Independence Day 2023 Sale: విమాన ప్రయాణికులకు బంపర్‌ ఆఫర్‌.. రూ.1,515కే ఫ్లైట్‌ టిక్కెట్‌!

Spicejet

Spicejet

SpiceJet announces Special Independence Day 2023 Sale: తక్కువ ధరలో విమాన ప్రయాణం చేయాలని భావిస్తున్న వారికి ఇది మంచి అవకాశం. కేవలం బస్ టికెట్ ధరకే విమానంలో ప్రయాణించే అవకాశంను దేశంలోని అతిపెద్ద ఎయిర్‌లైన్ కంపెనీలలో ఒకటైన ‘స్పైస్‌జెట్’ కల్పిస్తోంది. 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా స్పైస్‌జెట్ తన కస్టమర్ల కోసం ప్రత్యేక ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఈ ఆఫర్ కింద ప్రయాణికులు రూ. 1,515తో విమానంలో ప్రయాణించొచ్చు. ఒక్కసారైనా విమాన ప్రయాణం చేయాలనుకునే వారికి ఈ ఆఫర్ (SpiceJet Flight Ticket) బాగుంటుంది.

‘స్పెషల్ ఇన్‌క్రెడిబుల్ ఇండిపెండెన్స్ డే సేల్’ 2023ని సోమవారం స్పైస్‌జెట్ ప్రకటించింది. ఈ ఆఫర్ ఆగస్టు 14న ప్రారంభమై.. ఆగస్టు 20 వరకు ఉంటుంది. ఈ ఆఫర్ కింద మీరు 2023 ఆగస్టు 15 నుంచి 2024 మార్చి 30 వరకు ప్రయాణించవచ్చు. తక్కువ ధరలో ఫ్లైట్‌ టిక్కెట్‌ కాకుండా.. రూ. 2,000 విలువైన ఉచిత ఫ్లైట్ వోచర్‌ను కూడా అందిస్తోంది. ఇది కాకుండా మీకు నచ్చిన సీట్లను కేవలం రూ. 15కే రిజర్వ్ చేసుకోవచ్చని స్పైస్‌జెట్ తెలిపింది.

Also Read: Ben Stokes: బెన్‌ స్టోక్స్‌ సంచలన నిర్ణయం.. ఇంగ్లండ్‌ క్రికెట్ బోర్డు ఒత్తిడి కారణంగా..!

‘స్పెషల్ ఇన్‌క్రెడిబుల్ ఇండిపెండెన్స్ డే సేల్’ 2023లో భాగంగా ముంబై-గోవా, జమ్మూ-శ్రీనగర్, గోవా-ముంబై, గౌహతి-బాగ్డోగ్రా, చెన్నై-హైదరాబాద్ వంటి దేశీయ మార్గాలలో రూ. 1,515కి వన్ వే విమాన ప్రయాణం చేయొచ్చు. ఈ ఆఫర్ దేశీయ బుకింగ్‌లపై వన్-వే ప్రయాణంపై మాత్రమే చెల్లుబాటు అవుతుంది. అన్ని పన్నులతో కలిపి కలిపి రూ. 1,515కి దేశీయ వన్ వే విమాన ప్రయాణం చేయొచ్చు. గ్రూప్ బుకింగ్స్‌లో ఈ ప్రయోజనం అందుబాటులో ఉండదని, మరే ఇతర ఆఫర్‌తో కలపడం సాధ్యం కాదని కంపెనీ తెలిపింది. ఈ అవకాశాన్ని వినియోగించుకోవడం వల్ల తక్కువ ధర టికెట్స్‌తో మీరు అనుకున్న ప్రదేశాలను చూడొచ్చు.

 

Show comments