Site icon NTV Telugu

SpiceJet Emergency Landing: టేకాఫ్ తర్వాత రన్‌వేపై చక్రం.. అత్యవసర ల్యాండింగ్‌తో 75 మందికి తప్పిన ప్రమాదం

Spicejet Emergency

Spicejet Emergency

SpiceJet Emergency Landing: ముంబై విమానాశ్రయంలో శుక్రవారం స్పైస్‌జెట్ విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. కాండ్లా నుంచి ముంబైకి వెళ్తున్న స్పైస్‌జెట్ విమానం టేకాఫ్ తర్వాత విమానం చక్రం రన్‌వేపై కనిపించింది. వెంటనే విమానం ముంబై విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఈ సంఘటనపై ముంబై పోలీసులు మాట్లాడుతూ.. విమానంలోని 75 మంది ప్రయాణికులు ఉన్నారని, వారందరూ సురక్షితంగా ఉన్నారని తెలిపారు.

READ ALSO: Karimnagar : కరీంనగర్‌లో భారీ వర్షాలు, లోయర్ మానేరు జలాశయానికి వెల్లువెత్తుతున్న వరదనీరు

స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్ ప్రతినిధి మాట్లాడుతూ.. “కాండ్లా నుంచి ముంబైకి వెళ్తున్న స్పైస్‌జెట్ Q400 విమానం టేకాఫ్ తర్వాత రన్‌వేపై చక్రం కనిపించింది. వెంటనే విమానం ముంబైలో సురక్షితంగా ల్యాండ్ అయింది. ల్యాండింగ్ అయిన తర్వాత ప్రయాణీకులందరూ సాధారణంగా దిగారు” అని తెలిపారు. అదృష్టవశాత్తు ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడటంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు అన్నారు.

READ ALSO: Marriage Fraud: మరీ ఇంత దురదృష్టం ఏంటి భయ్యా.. నిజంగా పాపం సర్!

Exit mobile version