NTV Telugu Site icon

Spicejet Fire: స్పైస్‌జెట్‌ విమానంలో పొగలు.. ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరి

Spicejet

Spicejet

Spicejet flight emergency landing at shamshabad

శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో స్పైస్ జెట్ (SG3737) విమానం ఇంజన్‌ నుంచి పొగలు రావడంతో పైలట్‌ అత్యవసర ల్యాండింగ్ చేశారు. గోవా నుండి హైదరాబాద్ వస్తున్న స్పైస్ జెట్ విమానం శంషాబాద్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయ్యే కొద్ది నిమిషాల ముందు ఇంజన్ లో పొగలు రావడం మొదలైంది. పొగను పసిగట్టిన పైలెట్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో సేఫ్ గా ల్యాండింగ్ చేశారు. అయితే.. ఈ ఘటన జరిగిన సమయంలో.. విమానంలో 96మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే.. విమానం సేఫ్‌గా ల్యాండ్‌ అవడంతో విమానంలోని 96 మంది ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది. దీంతో ప్రయాణికులందరూ ఊపిరిపీల్చుకున్నారు.

Also Read : Kajal Aggarwal: ఏమాత్రం క్రేజ్‌ తగ్గని చందమామ.. లెగ్స్ అందాలను హైలెట్ చేస్తూ..

అయితే.. రాత్రి 11.05 గంటలకు విమానం ల్యాండ్‌ అయ్యింది. శంషాబాద్ ఎయిర్ పోర్టులో దిగడానికి కొద్ది నిమిషాల ముందు ఇంజన్ లో పొగలు కప్పుకున్నాయి. శంషాబాద్ ఎయిర్ పోర్టులో విమానాన్ని చెకింగ్‌ చేస్తున్నారు అధికారులు. ఇదిలా ఉంటే.. బ్బంది అడుగడునా నిర్లక్ష్యం వహించారని, నాగ్ పూర్ లో పొగలు గుర్తించినా అలాగే హైదరాబాద్ తీసుకొచ్చారని, పొగతోనే 20 నిమిషాలపాటు ప్రయాణం చేసి ప్రయాణికులు ఉక్కిరి బిక్కిరి అయ్యామని విమానంలోని ప్రయాణికులు అంటున్నారు. విమానం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌ రన్ వే చివరిలో అత్యవసర ల్యాండింగ్ అయిందని, ఆక్సిజన్ మాస్కులు కూడా సరిగ్గా పని చేయలేదని ప్రయాణికులు వాపోయారు.