NTV Telugu Site icon

Tamilnadu Accident: ఆగి ఉన్న లారీని ఢీ కొన్న వ్యాన్‌.. ఆరుగురు మృతి.. వైరల్ వీడియో

Lorry

Lorry

Tamilnadu Road Accident: అతి వేగం కారణంగా ఎన్నో ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అందుకే డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం తేడా జరిగినా నిండు నూరేళ్ల జీవితం గాల్లో కలిసిపోతుంది. ఇక రాత్రి పూట అయితే మరీ అప్రమత్తంగా ఉండాలి.ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా నిద్ర మత్తులోనే ప్రాణాలు గాల్లో కలిసి పోతాయి. ఇలా రాత్రి వేళల్లో చాలా యాక్సిండెంట్లు జరగడం మనం చూస్తూనే ఉంటాం. తాజాగా తమిళనాడులోకి కూడా ఇలాంటి ప్రమాదమే జరిగింది. హైవేపై ఆగి ఉన్న లారీని ఒక వ్యాన్ వేగంగా వచ్చి ఢీకొట్టింది.

Also Read: Gujarat: పిల్లల విషయంలో అలా చేస్తున్నారా.. ఇకపై అది నేరం

వివరాల ప్రకారం బుధవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో వేగంగా వచ్చిన వ్యాన్ ఆగి ఉన్న ఒక లారీని బలంగా ఢీకొట్టింది.  సేల‌మ్‌-ఈరోడ్ మ‌ధ్య ఉన్న హైవేపై ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఈ యాక్సిడెంట్ కు సంబంధించిన వీడియో అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఆ వ్యాన్ లో డ్రైవర్ తో కలిపి 8 మంది ఉన్నారు. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. చనిపోయిన వారిలో ఏడాది చిన్నారి కూడా ఉంది. ఇక ఆ వ్యాన్ ఎనుగూరు నుంచి పెరుంత‌రై వైపు వెళుతోంది. మృతిచెందిన‌వారిని సెల్వరాజ్, మంజుల‌,  ప‌ళ‌నిస్వామి, అరుముగం,ప‌ప్పాతిగా గుర్తించారు. ఇక అదే వ్యాన్ లో ఉన్న ప్రియా అనే ప్రయాణీకురాలు, డ్రైవర్  విఘ్నేశ్‌ కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో చూస్తుంటేనే వ్యాన్ ఎంత స్పీడ్ లో ఉందో ఉందో అర్థం అవుతుంది. కేవలం డ్రైవర్ స్పీడ్ గా నడపడం వల్లే బండి అదుపు తప్పి ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. దీనిపై విచారణ చేపట్టిన పోలీసలు కేేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.