NTV Telugu Site icon

Mirzapur 3 : మీర్జాపూర్ సీజన్ 3 నుండి స్పెషల్ అప్డేట్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

Mirzapur 3

Mirzapur 3

Mirzapur 3 : అమెజాన్ ప్రైమ్ వీడియోలో భారీ విజయం సాధించిన వెబ్ సిరీస్ లలో “మీర్జాపుర్”వెబ్ సిరీస్ ఒకటి. అత్యధిక వ్యూస్ దక్కించుకున్న ఇండియన్ సిరీస్‍గా మీర్జాపూర్ నిలిచింది. యాక్షన్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.మీర్జాపూర్ వెబ్ సిరీస్‍లో పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, దివ్యేందు, విక్రాంత్ మాసే, శ్రీయా పిల్‍గోవాంకర్, కుల్‍భూషణ్ ఖర్బంద, రసిక దుగ్గల్, శ్వేత త్రిపాఠి మరియు ఇషా తల్వార్ ప్రధాన పాత్రలు పోషించారు. కరణ్ ఆయుష్మాన్‍, పునీత్ కృష్ణ క్రియేటర్లుగా ఉన్నఈ సిరీస్ కు కరణ్ అనుష్మాన్‍తో పాటు గుర్మీత్ సింగ్, మిహిర్ దేశాయ్ దర్శకత్వం వహించారు.

Read Also :Pushpa 2 : క్లైమాక్స్ లో ఊహించని ట్విస్ట్ ఉండబోతుందా..?

ఆనంద్ భాస్కర్ మ్యూజిక్ అందించిన ఈ వెబ్ సిరీస్ ఇప్పటికే రెండు సీజన్ లు పూర్తి చేసుకుంది. మూడో సీజన్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియో మీర్జాపూర్ మూడో సీజన్ గురించి అప్డేట్ ఇచ్చింది.మీర్జాపూర్ సీజన్ 3 కోసం మరికొన్ని రోజులు ఆగండి అంటూ ఓ పోస్టర్ ను అమెజాన్ ప్రైమ్ వీడియో రిలీజ్ చేసింది. కుర్చీపై కూర్చున్న అలీ ఫైజల్ లుక్ బాగా వైరల్ అవుతుంది.ఈ ఏడాది జూన్ లేదా జులై లో ఈ సీజన్ 3 స్ట్రీమింగ్  కు  వచ్చే అవకాశం వుంది.ఈ సీజన్ లో గత రెండు సీజన్ లకు మించి ట్విస్టులు ఉండనున్నట్లు సమాచారం.

Show comments