Site icon NTV Telugu

Telangana Elections: ఓటు వేయని వారిని శిక్షించండి.. ఎన్నికల కమిషన్ కు పెరుగుతున్న రిక్వెస్టులు

Vote From Home

Vote From Home

Telangana Elections: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు 20.64శాతం పోలింగ్‌ నమోదైంది. సాయంత్రం ఐదు గంటల వరకు ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. అయితే గతేడాదితో పోలిస్తే ఈసారి తొలి రెండు గంటల్లోనే పోలింగ్ శాతం చాలా వరకు తగ్గింది. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా కొందరు కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రత్యేక విన్నపాలు చేస్తున్నారు. విదేశాల్లో ఓటు వేయకుంటే ఏం జరుగుతుందో తెలుసుకుని ఈసీకి విజ్ఞప్తులు చేస్తున్నారు. గ్రీస్, ఈజిప్ట్‌లలో ఓటు వేయని వ్యక్తులను ఉరితీస్తుంటారు. అలాగే ప్రజాస్వామ్చ భారతదేశంలో ఓటు వేయని వారికి కూడా ఇలాంటి శిక్షలు విధించాలని ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో అభ్యర్థించారు.

Read Also:Telangana Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విషాదం.. గుండెపోటుతో ఉద్యోగి మృతి!

ఇది ఇలా ఉంటే సోషల్ మీడియాలో కాళోజీ కవిత ట్రెండ్ అవుతోంది. కొత్త ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునేలా ఆయన చైతన్యం కలిపించారు. సందర్భానుసారం ప్రజాకవి, రచయిత కాళోజీ నారాయణ రావు మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన ఓటు హక్కుపై రాసిన ‘‘ఓటిచ్చినప్పుడే ఉండాలి బుద్ధి..’’ కవిత ట్రెండ్ అవుతోంది.

Read Also:CPI Narayana: పోలింగ్ వేళ రాజకీయ లబ్ధిపొందేందుకే అర్ధరాత్రి హంగామా: సీపీఐ నారాయణ

Exit mobile version