TTD: కొలిచినవారి కొంగుబంగారం, కలియుగ ప్రత్యక్షదైవం, తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రతీ రోజూ విశేష కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి.. ఇక, కొన్ని ప్రత్యేక రోజుల్లో.. విశేష పర్వదినాల్లో శ్రీవారికి ప్రత్యేక కైంకర్యాలు నిర్వహిస్తూ వస్తుంటారు.. జనవరి నెల ముగింపునకు వచ్చేసింది.. త్వరలోనే ఫిబ్రవరి నెల ప్రారంభం కానుంది.. ఈ నేపథ్యంలో శ్రీవారి ఆలయంలో ఫిబ్రవరి నెలలో జరుగనున్న విశేష పర్వదినాలను ప్రకటించింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి.
ఫిబ్రవరి నెలలో విశేష పర్వదినాలు ఈ క్రింద విధంగా ఉన్నాయి..
* ఫిబ్రవరి 9న శ్రీ పురందరదాసుల ఆరాధనోత్సవం.
* 10న తిరుకచ్చినంబి ఉత్సవారంభం.
* 14న వసంతపంచమి.
* 16న రథసప్తమి.
* 19న తిరుకచ్చినంబి శాత్తుమొర.
* 20న భీష్మ ఏకాదశి.
* 21న శ్రీ కులశేఖరాళ్వార్ వర్ష తిరునక్షత్రం.
* 24న కుమారధార తీర్థముక్కోటి, మాఘ పౌర్ణమి గరుడ సేవ నిర్వహించనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రకటించింది.