NTV Telugu Site icon

Tirumala: ఆగస్టులో తిరుమలలో జరిగే విశేష ఉత్సవాలు ఇవే..

Tirumala

Tirumala

Tirumala: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవారికి ఏటా నిర్వహించే ఉత్సవాలతో పాటు మాసం వారిగా జరిపే విశేష ఉత్సవాలను టీటీడీ అధికారులు వెల్లడించారు. దీనిలో భాగంగా ఆగస్టు నెలలో జరిగే ఉత్సవాల వివరాలను ప్రకటించారు.

Read Also: Lal Darwaja Bonalu: ప్రారంభమైన లాల్‌ దర్వాజా బోనాలు.. బోనం ఎత్తిన పాత బస్తీ..

ఆగస్టులో తిరుమలలో విశేష ఉత్సవాలు

– ఆగస్టు 4న శ్రీ చక్రత్తాళ్వార్ వర్షతిరునక్షత్రం, శ్రీ ప్రతివాది భయంకర అణ్ణంగరాచార్య వర్ష తిరునక్షత్రం.

– ఆగస్టు 7న ఆండాళ్ తిరువాడిపురం శాత్తుమొర. శ్రీవారు పురిశైవారి తోటకు వేంచేపు.

– ఆగస్టు 9న గరుడ పంచమి, తిరుమల శ్రీవారి గరుడ సేవ.

– ఆగస్టు 10న కల్కి జయంతి.

– ఆగస్టు 13న తరిగొండ వెంగమాంబ వర్ధంతి.

– ఆగస్టు 14న తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలకు అంకురార్పణ.

– ఆగస్టు 15న భార‌త స్వాతంత్య్ర దినోత్స‌వం. స్మార్త ఏకాదశి.

– ఆగస్టు 15 నుంచి 17వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు.

– ఆగస్టు 16న వరలక్ష్మీ వ్రతం. నారాయణగిరిలో ఛత్రస్థాపనోత్సవం.

– ఆగస్టు 19న శ్రావణపౌర్ణమి. పౌర్ణమి గరుడ సేవ. రాఖీ పండుగ. హయగ్రీవ జయంతి. విఖ‌న‌స మ‌హాముని జ‌యంతి.

– ఆగస్టు 20నతిరుమల శ్రీవారు శ్రీ విఖనసాచార్య స్వామి సన్నిధికి వేంచేపు. గాయత్రీ జపం.

– ఆగ‌స్టు 27న శ్రీ‌కృష్ణాష్ట‌మి, తిరుమ‌ల శ్రీ‌వారి ఆస్థానం.

– ఆగ‌స్టు 28న శ్రీ‌వారి శిక్యోత్సవం

Show comments