NTV Telugu Site icon

IRCTC Meals: విజయవాడ రైల్వేస్టేషన్లో స్పెషల్ కౌంటర్.. రూ. 20కే భోజనం..

Meals Irctc

Meals Irctc

నేటి నుంచి ప్రయాణికుల కోసం ఎకనామి మీల్స్ పేరుతో కేవలం రూ. 20కు నాణ్యమైన భోజనం అందుబాటులోకి తెచ్చారు ఐఆర్సీటీసీ అధికారులు. ప్రస్తుతం వేసవి కాలం సందర్భంగా అనేక మార్గాలలో ప్రత్యేక రైలుతోపాటు.. అధికారులు స్పెషల్ భోజనాన్ని అందిస్తున్నారు. దీనికోసం విజయవాడ రైల్వే స్టేషన్లో జనరల్ బోగీలు ఆగే స్థలానికి దగ్గరలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు రైల్వే అధికారులు.

Also read: Shocking video: బైకర్‌పై దూసుకెళ్లిన బస్సు.. పట్టించుకోని బాటసారులు.. వీడియో వైరల్

ఇందులో భాగంగా 20 రూపాయలకే ఎకనామి మీల్స్, అలాగే 50 రూపాయలకు స్నాక్ మీల్స్ అంటూ రెండు వేరు వేరు పదార్థాలను అందిస్తున్నారు. వేసవికాలం దృష్టిలో ఉంచుకొని ప్రయాణికుల రద్దీ దృష్ట్యా అతి తక్కువ ధరకే నాణ్యమైన భోజనాన్ని అందించాలని ఐఆర్సీటీసీతో కలిసి రైల్వే అధికారులు ఏర్పాటు చేశారు.

Also read: Israel: హిజ్బుల్లాపై విరుచుకుపడిన ఇజ్రాయిల్ ఆర్మీ.. 40 టెర్రర్ టార్గెట్లు ధ్వంసం..

ముఖ్యంగా జనరల్ బోగీలలో ప్రయాణం చేసే ప్రయాణికుల ఆకలి తీర్చాలని లక్ష్యంగా పెట్టుకొని ఈ కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇక ఈ కార్యక్రమం కేవలం వేసవికాలం పూర్తయ్యే వరకు మాత్రమే ఉంటుందని రైల్వే అధికారులు వెల్లడించారు. ఇలాంటి కౌంటర్లను ప్రస్తుతం ప్రయోగాత్మకంగా విజయవాడ, రాజమహేంద్రవరం రెండు స్టేషన్లో మాత్రమే ఏర్పాటు చేసినట్లు రైల్వే డిఆర్ఎం నరేంద్ర ఆనందరావు పాటిల్ మీడియా పూర్వకంగా తెలిపారు. నిజంగా జనరల్ భోగీలు ఆగే చోట ఈ ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయడం ద్వారా అనేకమందికి ఆకలికి తీర్చే విధంగా సదుపాయాన్ని కల్పించారు అధికారులు.