పారిశుద్ధం పై ప్రత్యేక దృష్టి సాధించాలనీ, వర్షాకాలం లో సీజనల్ వ్యాధులు రాకుండా అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి ఆదిలాబాద్ జిల్లాను ఆదర్శ జిల్లా గా తీర్చిదిద్దాలని పంచాయితీ రాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ, గృహనిర్మాణ శాఖ ఉమ్మడి జిల్లా ఇంచార్జీ మంత్రి సీతక్క (అనసూయ) అధికారులను ఆదేశించారు. స్వచ్ఛధనం పచ్చదనం ప్రత్యేక 5 రోజుల కార్యక్రమంలో చేపట్టిన పారిశుద్ధ్య పనుల ప్రగతి పై సమీక్షించుకుని ఈ కార్యక్రమం నిరంతర ప్రక్రియ గా కొనసాగాలని ఆన్నారు. వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులపై, వరదలు విష జ్వరాలు హాస్టల్స్ స్కూల్ లలో సమస్యలు, మిషన్ భగీరథ ,వైద్యం మహిళా శిశు సంక్షేమ శాఖ అంగన్వాడి కేంద్రాల పై మంత్రి సమీక్షించారు.
Minister Ramprasad Reddy: అమరావతి నిర్మాణానికి మంత్రి విరాళం
మహిళ శిశు సంక్షేమ ద్వారా సరఫరా అవుతున్న పౌష్టికాహారం, గుడ్లు తదితర వాటిపై ప్రత్యేక దృష్టి సారించి, నాణ్యమైన ఆహారం అందించాలని, కుళ్లిపోయిన గ్రుడ్లు తీసుకోకుండా, నాణ్యమైన గ్రుడ్లు తీసుకునేలా సూపర్వైజర్ చర్యలు చేపట్టాలని, గ్రామాలలో నీటి ఎద్దడి లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని, ప్రత్యేక అధికారులుగా నియమించిన అధికారులు ప్రతిరోజు ఫీల్డ్ కి వెళ్లాలని పట్టణాలలో గ్రామాల్లో పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి సారించి, వ్యాధులు రాకుండా చూడాలని, పారిశుద్ధ్య కార్యక్రమం నిరంతర ప్రక్రియ ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాల శుభ్రత పాటించాలన్నారు.
Bangladesh: షేక్ హసీనాకు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం నుంచి సందేశం