Site icon NTV Telugu

Tammineni Seetharam: దొంగోడిని విడుదల చేస్తే ఆశ్చర్యకరంగా కేరింతలేంటి..?

Tammineni Seetharam

Tammineni Seetharam

Tammineni Seetharam: దొంగోడిని విడుదల చేస్తే ఆశ్చర్యకరంగా కేరింతలేంటి..? అంటూ స్పీకర్‌ తమ్మినేని సీతారాం టీడీపీ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. భువనేశ్వరి నిజమే గెలవాలంటుందని, మేము అదే అంటున్నాం నిజమే గెలవాలని అని ఆయన స్పష్టం చేశారు. నిజమే గెలవాలి‌, నిజమే గెలుస్తుందన్నారు తమ్మినేని సీతారాం. మీరన్నట్లు నిజమే గెలవాలనుకుంటే ఈ జన్మకి జైలు నుంచి మళ్లీరాడని ఆయన భువనేశ్వరిని ఉద్దేశించి అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన 99 శాతం ఇచ్చిన హామీలు నెరవేర్చామన్నారు. అసత్యాలు, అబద్ధాలు మాట్లాడుతున్న ప్రతిపక్షాలు జనంలో తిరుగుతున్నాయన్నారు. మనం చేసిన పని చెప్పుకుంటే చాలు విజయం మనదేనని వైసీపీ నేతలను ఉద్దేశించి మాట్లాడారు. నేడు గడప గడపలో సంతృప్తి వ్యక్తం అవుతుందని ఆయన అన్నారు. అవినీతి లేని ప్రభుత్వం అందిండంతో ప్రజలు అనందం వ్యక్తం చేస్తున్నారన్నారు.

Also Read: KP Nagarjuna Reddy: ఎంపీతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

పేదరికం శాపం కాకూడదని విద్యా , వైద్యంతో పాటు రాజ్యాధికారం కల్పించి జగన్ గౌరవం ఇచ్చారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సీఎంలు గతంలో ఎవరూ లేరన్నారు. నావల్ల మేలు జరిగితేనే ఓటు వెయ్యండని చెప్పడం సాహాసోపేతమైన నిర్ణయమన్నారు. మౌత్ టు మౌత్ చర్చ జరగాలి , మనం నిజం మాటాడాలి , వాస్తవాలు చెప్పాలన్నారు. జనాల్ని చైతన్యవంతం చేయాలి , తొలి విజయ శంఖారావాన్ని విజయవంతం చేయాలన్నారు. పెను ఉప్పెనలో ప్రతిపక్షాలు నిలబడాలంటే గుండెల్లో దడ పెరగాలని, భయపడి ఇంటికి వెళ్లిపోవాలన్నారు.

Exit mobile version