NTV Telugu Site icon

Lesbian Couple: ఇద్దరూ కడుపులో మోసి.. బిడ్డకు జన్మనిచ్చిన స్వలింగ జంట!

Spain Lesbian Couple

Spain Lesbian Couple

Same Gender Couple carried and blessed with baby in Spain: ఈ భూప్రపంచంలో ఓ మహిళ బిడ్డకు జన్మనివ్వడం సహజమే. ఇటీవలి సంవత్సరాల్లో స్వలింగ జంటలు కూడా పలు పద్దతుల ద్వారా బిడ్డకు జన్మనిస్తున్నాయి. అయితే స్వలింగ జంటలు బిడ్డకు జన్మనివ్వడమే పెద్ద విచిత్రం అనుకుంటే.. ఏకంగా ఇద్దరు కలిసి ఒక బిడ్డనే కడుపున మోయడం అనేది పెద్ద మిరాకిలే అని చెప్పాలి. ఈ విచిత్ర ఘటన స్పెయిన్‌లో చోటుచేసుకుంది. స్పెయిన్‌లోని ఓ లెస్బియన్ జంట.. బిడ్డను ఇద్దరూ కడుపులో మోసి కన్నారు. అక్టోబర్‌ 30న వారు ఓ మెగా బిడ్డకు జన్మనివ్వగా.. విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వివరాల ప్రకారం… మజోర్కాలోని పాల్మాలో 30 ఏళ్ల ఎస్టీఫానియా, 27 ఏళ్ల అజహారాలు స్వలింగ జంట. ఇద్దరూ మహిళలే కాబట్టి వారికి మాతృత్వం పొందే అవకాశం లేదు. అమ్మతనాన్ని ఆస్వాదించాలనుకున్న ఆ జంట.. పిల్లలను కనాలనుకున్నారు. ఇందుకోసం ఫెర్టిలిటి సెంటర్‌కు వెళ్లారు. ముందుగా ఎస్టీఫానియా గర్భంలో స్పెర్మ్‌ను ప్రవేశపెట్టి.. ఫలదీకరణం చెందేలా చేశారు. 5 రోజుల తర్వాత ఆ పిండాన్ని అజహారా గర్భంలో ప్రవేశపెట్టారు.

Also Read: IND vs AUS: కెప్టెన్‌గా సూర్యకుమార్‌.. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు భారత జట్టు ఇదే!

అజహరా పిండాన్ని తొమ్మిది నెలల పాటు తన గర్భంలో మోసింది. చివరకు అక్టోబర్‌ 30న అజహరా ఓ బాలుడికి జన్మనిచ్చింది. అతడి పేరు డెరెక్ ఎలోయ్. ఇలా ఒకే బిడ్డను ఎస్టీఫానియా, అజహారాలు మోశారు. తమ కలను నిజం చేసుకోవడానికి వారు నాలుగు లక్షలకు పైగా ఖర్చు పెట్టారట. ఇలా ఒకే బిడ్డను ఇద్దరు గర్భంలో మోయడం ఇదే మొదటిసారి కాదు. 5 ఏళ్ల క్రితం టెక్సాస్‌లో ఓ స్వలింగ జంట ఇలానే ఓ బిడ్డను కన్నారు. ఈ జంట కూడా మహిళలే కావడం విశేషం. ఇలా బిడ్డను కనడాన్ని ‘ఇన్వోసెల్‌’ అంటారు.