పెడన పోలీసు స్టేషన్ పరిధిలో తోటమూల సెంటరులో జనసేన బహిరంగ సభకు అనుమతి కోసం పవన్ కళ్యాణ్ దరఖాస్తు చేశారు అని కృష్ణాజిల్లా ఎస్పీ జాషువా తెలిపారు. తన సభలో దాడులు జరుగుతాయని పవన్ కళ్యాణ్ ఆరోపించారు.. అక్కడ పూర్తి విచారణ, పరిశీలన చేశాం.. పవన్ కేడర్ కు ఇచ్చిన సందేశం పైన పూర్తి పరిశీలన చేశాం.. పవన్ కళ్యాణ్ ఆరోపణలకు ఏవైనా సాక్ష్యాలున్నాయా అని ఆయనకు నోటీసు ఇచ్చామని ఎస్పీ పేర్కొన్నారు. అలాంటి అసాంఘిక శక్తులు ఉంటే చర్యలు కచ్చితంగా తీసుకుంటాం.. ఎటువంటి సమాచారంతో అలాంటి వ్యాఖ్యలు చేసారు.. మా నోటీసుకు పవన్ కళ్యాణ్ నుంచీ రిప్లై రాలేదు అని ఎస్పీ జాషువా అన్నారు.
Read Also: Ram Charan: ముంబైలోని సిద్ధి వినాయక ఆలయంలో దీక్షను పూర్తి చేసిన గ్లోబల్ స్టార్
మీ వ్యాఖ్యలలో పస ఉంటే మాకు చెప్పండి.. మేం యాక్షన్ తీసుకుంటామని ఎస్పీ జాషువా తెలిపారు. రిప్లై లేదంటే నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని మేం అనుకోవాలా.. పవన్ కళ్యాణ్ సభకు పూర్తిస్ధాయి బందోబస్ధు ఏర్పాటు చేశాం.. వ్యాఖ్యలు, ఆరోపణలు సరైన ఆధారాలు లేకుండా చేయకూడదు అని ఆయన అన్నారు. బాధ్యతారాహిత్యంగా ఆరోపణలు చేస్తే పర్యవసానాలు ఉంటాయి.. మా సమాచార వ్యవస్ధ మాకుంది.. మాకు ఎటువంటి సమాచారం లేదు.. మేం నాలుగు రోజులుగా స్పెషల్ బ్రాంచ్ పోలీసులతో జల్లెడ పడుతున్నామని ఎస్పీ పేర్కొన్నారు.
Read Also: Telangana : ఛీ.. ఛీ.. వీళ్లు అస్సలు మనుషులేనా? తల్లి దండ్రులన్న కనికరం కూడా లేకుండా..
రెచ్చగొట్టే భాష, సైగలు, లా అండ్ ఆర్డర్ కు భంగం కలిగించే అంశాలు వాడడం మానుకుని మాట్లాడాలి అని కృష్ణాజిల్లా ఎస్పీ జాషువా హెచ్చరించారు. ప్రముఖ వ్యక్తులు, పోలీసు శాఖ, ఉన్నతాధికారుల మీద వ్యాఖ్యలు చేస్తే మేం రికార్డు చేసి పరిశీలిస్తాం.. ఇలాంటి ఆరోపణలు రాజకీయ పార్టీలు చేయొద్దని ఆయన కోరారు. జనసేన సభకు ఎలాంటి ఆటంకాలు రాకుండా తగిన భద్రతా ఏర్పాటు చేశామని ఎస్పీ తెలిపారు.