Telangana Rains : రాబోయే రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించనున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీతో పాటు తెలంగాణలో వచ్చే నాలుగు రోజుల పాటు విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. మోస్తరు నుంచి భారీ వర్షాలు ఏపీకి చెందిన ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో కురిసే అవకాశముంది.
Pawan Kalyan: ప్రధాని మోడీ ఓట్లు కోసం చూడరు.. దేశ అభివృద్ధి కోసమే యోచిస్తారు!
అంతేకాకుండా, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురవచ్చని హెచ్చరిక జారీ చేసింది. తెలంగాణలో మెదక్, సిద్దిపేట, కామారెడ్డి, సిరిసిల్ల జిల్లాల్లో వర్షాలు పడే సూచనలున్నాయి. ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా మట్టిశిల్పకారులు, ఓపెన్‌లో పనిచేసే ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ కోరుతోంది.
