South West Monsoon: ఈసారి ముందుగానే నైరుతి రుతుపవనాలు.. 2009 తర్వాత మళ్లీ ఇప్పుడే!
- ఈసారి ముందుగానే నైరుతి రుతుపవనాలు
- మే 27న కేరళను తాకే అవకాశం
- జులై 8 నాటికి భారత్ వ్యాప్తంగా విస్తరిస్తాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నైరుతి రుతుపవనాలు ఈసారి మే 27న కేరళను తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఇవాళ తెలిపింది. నైరుతి రుతుపవనాలు ప్రవేశించాక జులై 8 నాటికి భారత్ వ్యాప్తంగా విస్తరిస్తాయి. సాధారణంగా ప్రతి ఏడాది జూన్ 1 లేదా ఆ తర్వాత రుతుపవనాలు కేరళలోకి ప్రవేశిస్తాయి. దీంతో వర్షాకాలం ప్రారంభమైందని భావిస్తాం. అయితే 2009లో నైరుతి రుతుపవనాలు మే 23నే ప్రవేశించాయి. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు అంచనాల కంటే చాలా ముందుగానే నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తున్నాయి. సెప్టెంబరు 17న రుతుపవనాల ఉపసంహరణ ప్రారంభమవుతుంది. ఆ తదుపరి నెల 15 నాటికి ఇది ముగుస్తుంది.
ఈసారి వర్షపాతం సాధారణం కంటే అధికంగా నమోదు అవుతుందని ఐఎండీ ఏప్రిల్ నెలలోనే తెలిపింది. సాధారణం కంటే తక్కువగా వర్షపాతం కురిసే ఎల్‌నినో పరిస్థితులు లేవని చెప్పింది. భారత్‌లో 52 శాతం నికర సాగు భూమికి వానలే ఆధారం. భారత్‌లోని వ్యవసాయ ఉత్పత్తిలో దీని నుంచి 40 శాతం దిగుబడి వస్తుంది. ఇండియాలో ఆహార భద్రతతో పాటు ఆర్థిక స్థిరత్వానికి నైరుతి రుతు పవనాలది ప్రధాన పాత్ర. ‘నాలుగు నెలల రుతుపవన కాలంలో (జూన్ నుంచి సెప్టెంబర్ వరకు) భారతదేశంలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. దీర్ఘకాలిక సగటు 87 సెంమీలో 105 శాతం వర్షపాతం నమోదవుతుందని అంచనా వేశాం’ అని అధికారులు అప్పట్లో ప్రకటించారు.
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
Also Read: Miss World 2025: మరికాసేపట్లో గచ్చిబౌలి స్టేడియంలో మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభం.. షెడ్యూల్ ఇదే!
జూన్ నుంచి సెప్టెంబర్ వరకు సాధారణంగా భారతదేశంలో దాదాపు 87 సెంమీ వర్షం పడుతుంది. దీనిని దీర్ఘకాలిక సగటు అంటారు. ఈ సంవత్సరం మాత్రం మొత్తం వర్షపాతం 87 సెంమీలో 105 శాతం ఉంటుందని అంచనా వేశారు. అంటే 91.35 సెంమీ వర్షపాతం పడుతుందని అంచనా వేసినట్లు లెక్క. దేశ వ్యాప్తంగా తాగునీరు, విద్యుత్ ఉత్పత్తికి కీలకమైన జలాశయాలను తిరిగి నింపడానికి నైరుతి రుతుపవనాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.
- Tags
- IMD
- india
- Kerala
- south west monsoon
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!