దక్షిణ మధ్య రైల్వేలో భారీగా రైళ్లను రద్దు చేసింది. దీంతో సౌత్ సెంట్రల్ రైల్వే రైల్వే రవాణా వ్యవస్థ స్థంభించింది. ఒకే సారి 80కి పైగా రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. భారీ వర్షాలతో రైల్వే ట్రాక్ ల మీదకు వరద నీరు చేరుకుంది. రైల్వే ఉన్నతాధికారులు రైల్వే నిలయం డిజాస్టర్ మేనేజ్మెంట్ కంట్రోల్ రూం నుంచి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. వరద ఉధృతికి కేసముద్రం, విజయవాడ రాయంపాడు ట్రాక్ ల మీద నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. భారీ రైళ్ల రద్దు మీద దక్షిణ మధ్య రైల్వే అధికారులు స్పందించారు. ప్రయాణికులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికుల భద్రత కోసమే రైళ్ళను రద్దు చేస్తున్నామని తెలిపారు. ఆర్టీసీ బస్సులు, రాష్ట్ర ప్రభుత్వం సహాయంతో ప్రయాణికులకు ఇబ్బందులు రాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని రైల్వే అధికారులు పేర్కొన్నారు. వర్షాలు తగ్గిన తర్వాత ట్రాక్ పునరుద్దణ పనులు చేపడతామని, మరో రెండు రోజుల్లో మరమ్మత్తులు పునరుద్ధరణ చర్యలు ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు.
Duddilla Sridhar Babu: పాలమాకుల కస్తూర్బా గురుకుల పాఠశాలను సందర్శించిన మంత్రి శ్రీధర్ బాబు
