South Central Railway: రాజమండ్రి మీదుగా అకస్మాత్తుగా 26 రైళ్లను ఏకంగా 45 రోజులపాటు రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.. దీంతో.. రత్నాచల్, జన్మభూమి, సింహాద్రి, సర్కార్ సహా ప్రయాణికులు డిమాండ్ ఉన్న రైళ్లు కూడా ఉండడంతో.. ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలోని కడియం – నిడదవోలు మధ్య రైల్వే ట్రాక్ మరమ్మత్తు పనులు చేపడుతున్న కారణంగా రైళ్లు రద్దు చేస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు.. అయితే, దీనిపై ప్రయాణికులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.. ఈ నేపథ్యంలో.. రద్దు చేసిన రైళ్లలో కొన్ని సర్వీసులను పునరుద్ధరిస్తున్నట్టుగా ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే.. దీంతో, రేపటి నుంచి యథావిథిగా కొన్ని సర్వీసులు అందుబాటులోకి రాబోతున్నాయి..
Read Also: Hyderabad Police: హైదరాబాద్‌లో ఫ్రెండ్లీ పోలీస్ లేదు.. రాత్రి 10:30 దాటితే లాఠీ పోలీసే..
ఇక, రేపటి నుంచి యథావిథిగా నడవనున్న రైళ్ల విషయానికి వస్తే.. విశాఖ – లింగంపల్లి మధ్య జన్మభూమి ఎక్స్ ప్రెస్, కాకినాడ పోర్ట్ – పాండిచ్చేరి మధ్య సర్కార్ ఎక్స్ ప్రెస్, కాకినాడ పోర్టు – విజయవాడ మధ్య మెమూ ఎక్స్ ప్రెస్ పునరుద్ధరిస్తున్నట్టు ఓ ప్రకటన విడుదల చేసింది సౌత్ సెంట్రల్ రైల్వే.. అయితే, రత్నాచల్ , సింహాద్రి ఎక్స్ ప్రెస్ రైళ్లు ప్రకటించిన విధంగానే రద్దు చేయబడతాయని స్పష్టం చేశారు అధికారులు.