NTV Telugu Site icon

Special Trains: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా.. 10 ప్రత్యేక రైళ్ల పొడిగింపు!

Trains

Trains

10 special trains Between AP and Telangana: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా.. 10 ప్రత్యేక రైళ్లను డిసెంబర్ చివరి వారం వరకు పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. సికింద్రాబాద్‌-తిరుపతి (07482) రైలు డిసెంబర్ 4-25వ తేదీ వరకు ప్రతి సోమవారం అందుబాటులో ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. తిరుపతి-సికింద్రాబాద్‌ (07481) రైలు డిసెంబర్ 3-31 వరకు ప్రతి ఆదివారం, హైదరాబాద్‌-నర్సాపూర్‌ (07631) రైలు డిసెంబరు 2-30 వరకు ప్రతి శనివారం నడుస్తుందని తెలిపారు.

Also Read: IND vs AUS: ఆస్ట్రేలియాతో నాలుగో టీ20.. హైదరాబాదీ ప్లేయర్‌ ఔట్‌!

నర్సాపూర్‌-హైదరాబాద్‌ (07632) రైలు డిసెంబరు 3-31 వరకు ప్రతి ఆదివారం.. కాకినాడ-లింగంపల్లి (07445) రైలు డిసెంబరు 1-29 వరకు ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో.. లింగంపల్లి-కాకినాడ (07446) రైలు డిసెంబరు 2-30 వరకు ప్రతి మంగళ, గురు, శనివారాల్లో అందుబాటులో ఉంటుంది. తిరుపతి-అకోలా, పూర్ణ-తిరుపతి మధ్య రెండు జతల ప్రత్యేక రైళ్లు తిరుగుతాయని దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెప్పారు.

Show comments