Special Trains: పండుగల సీజన్ వచ్చిందంటే చాలు.. సొంత ఊళ్లకు వెళ్లేవారి ప్రయాణం కత్తిమీద సాము లాంటిది.. ఓవైపు పండుగకు వెళ్లాలనే తాపత్రయం.. మరోవైపు.. ప్రైవేట్ బస్సులు, ప్రత్యేక బస్సుల దందా.. సామాన్యుడికి పండుగ పూట చుక్కలు కనబడేలా చేస్తున్నాయి.. అయితే, పండుగ సమయంలో.. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్యే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది.. సంక్రాంతి పండుగ దృష్ట్యా.. పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడపనుంది.. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు చెబుతున్నారు..
Read Also: KTR: జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో కేటీఆర్ సమావేశం
సంక్రాంతి పండుగ సమయంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని 20 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు ప్రకటించింది సౌత్ సెంట్రల్ రైల్వే.. కాచిగూడ-కాకినాడ టౌన్, హైదరాబాద్-తిరుపతి రైల్వే స్టేషన్ల మధ్య 20 ప్రత్యేక రైళ్లను నడపనున్నారు.. ఈ నెల 28వ తేదీ నుంచి 2024 జనవరి 26వ తేదీ వరకు వివిధ తేదీల్లో ఈ రైళ్లు రాకపోకలు కొనసాగుతాయి.. ఇక, ఈ ప్రత్యేక రైళ్లన్నింటిలోనూ ఫస్ట్ ఏసీ, సెకెండ్ ఏసీ, థర్డ్ ఏసీతో పాటు స్లీపర్, జనరల్ బోగీలు ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది.. తిరుపతి-అకోలా, పూర్ణ-తిరుపతి, హైదరాబాద్-నర్సాపూర్, తిరుపతి-సికింద్రాబాద్, కాకినాడటౌన్-లింగంపల్లి రైల్వే స్టేషన్ల మధ్య మరికొన్ని ప్రత్యేక రైళ్లను నడపనున్నారు రైల్వే అధికారులు.. పూర్తి వివరాలను సౌత్ సెంట్రల్ రైల్వేకి చెందిన అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.